News
News
X

Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!

Flag Hoisting vs Flag Unfurling: జాతీయ జెండాను స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఒకలా, గణతంత్ర దినోత్సవాల్లో మరోలా ఎగరేస్తారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

FOLLOW US: 

ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం రెపరెప లాడుతోంది. అయితే....ఏటా రెండు సందర్భాల్లో దేశమంతా జాతీయ పతాకాని గౌరవ వందనం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ సారి, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి. ఈ రెండు సార్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినప్పటికీ...ఆ విధానంలో ఎంతో తేడా ఉంటుంది. జనవరి 26న ఒకలా, ఆగస్టు 15నమరోలా జెండా ఎగరేస్తారు. దీన్నే ఫ్లాగ్ కోడ్ అంటారు. ఈ రెండు సందర్భాల్లో పాటించే జాగ్రత్తలేంటో..కనిపించే తేడాలేంటో ఓ సారి చూద్దాం. 

తేడాలివే..

1. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల్లో జెండా కర్రకు త్రివర్ణ పతాకం కింది భాగంలో కట్టి ఉంటుంది. ఆ తాడుని పైకి లాగుతున్న కొద్ది జెండా పైకి చేరుకుంటుంది. చివరకు చేరుకోగానే తాడుని గట్టిగా లాగుతారు. అప్పుడు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇదే విధంగా చేశారు. స్వాతంత్య్రం సాధించిన ఆ చరిత్రాత్మక ఘటనకు సాక్ష్యంగా జెండాను ఆవిష్కరించారు. అప్పుడు ఆయన పాటించిన విధానమే ఇప్పటికీ కొనసాగుతోంది. రాజ్యాగంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇంగ్లీష్‌లో దీన్నే "Flag Hoisting" అంటారు. అదే రిపబ్లిక్ డే వేడుకల్లో ముందుగానే జెండా పైన కట్టేసి ఉంటుంది. దాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంలో "Flag Unfurling"గా పేర్కొన్నారు. 

2. ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధానమంత్రి జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతికి ఆ అవకాశం ఉండదు. ఇందుకు ఓ ప్రధాన కారణముంది.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశానికి ప్రధాని మాత్రమే ఉన్నారు. ఆయనే దేశ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి రాజ్యాంగం కూడా అమల్లోకి రాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, రాష్ట్రపతి పదవిని తీసుకొచ్చారు. అందుకే..ఆగస్టు 15న త్రివర్ణపతాకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తే, ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తారు. అదే గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కనుక, రాజ్యాంగానికి అధినేతగా భావించే రాష్ట్రపతి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. 

3.ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తే..గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో జెండా ఎగరేస్తారు. 

ఫ్లాగ్ కోడ్ పాటించాల్సిందే..

కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి. 

ఫ్లాగ్ కోడ్‌ను అనుసరించండి...
1.జెండాను ఒకప్పుడు ఖాదీ వస్త్రంతోనే తయారు చేసేవారు. ఇప్పుడు పాలిస్టర్‌తో చేసినవి కూడా అనుమతిస్తున్నారు. 

2. జాతీయ జెండాను ఎగురవేశాక, ఆ జెండా కన్నా ఎత్తులో ఇతర ఏ జెండా ఉండకుండా చూసుకోవాలి. అది దేవుడినిక సంబంధించినదైనా కూడా జాతీయ జెండా కన్నా తక్కువ ఎత్తులోనే ఉండేట్టు చూసుకోవాలి. 

3. చిరిగిపోయిన, నలిగిపోయిన జెండాను ఎగురవేయకూడదు. 

Also Read: Bihar Politics: బీజేపీ బిహార్ మిషన్ స్టార్ట్ అయిందా? కాషాయ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?

Also Read: Munugodu Congress : మన మునుగోడు - మన కాంగ్రెస్ ! ఉపఎన్నికల్లో అమల్లోకి రేవంత్ ప్లాన్

Published at : 12 Aug 2022 02:27 PM (IST) Tags: Independence Day Republic Day Flag Hoisting Flag Unfurling Flag Hoisting vs Flag Unfurling

సంబంధిత కథనాలు

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

Nizamabad News: ఆ ఊరిలో తొలి మొక్కులు గాంధీజీకే- అనాధిగా వస్తున్న ఆచారం

Nizamabad News: ఆ ఊరిలో తొలి మొక్కులు గాంధీజీకే- అనాధిగా వస్తున్న ఆచారం

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు