Swami Sivananda: 127 ఏళ్ల వయసులోనూ యోగాసనాలు, ఈ పెద్దాయన హెల్త్ సీక్రెట్ అదేనట
Swami Sivananda Yoga: 127 ఏళ్ల వయసులోనూ స్వామి శివానంద యోగాసనాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Swami Sivananda Yoga Video: ఉదయమే లేచి వ్యాయామం చేయాలంటేనే మనకి బద్ధకం. కొద్ది రోజులు జిమ్‌కి వెళ్లి ఆ తరవాత లైట్ తీసుకుంటాం. ఇక యోగా సంగతి సరే సరి. ఆరోగ్యానికి చాలా మంచిది అన్నా పట్టించుకోం. కానీ..ఓ పెద్దాయన మాత్రం 127 ఏళ్ల వయసులోనూ చాలా సులువుగా యోగాసనాలు చేసేస్తున్నారు. పేరు పేరు స్వామి శివానంద. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే (International Yoga Day 2024) సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. దాదాపుగా వందేళ్లుగా యోగాలో ట్రైనర్ గా ఉన్న శివానందను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
ప్రస్తుత కాలంలో 70-80 ఏళ్లు బతకడమే కష్టం అలాంటింది ఈయనకు 127 ఏళ్లు. ఐనా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఆయన లైఫ్ స్టైలే. ఉదయం 3 గంటలకే నిద్రలేచి యోగా చేసుకుంటారు. అనంతరం పూజలు చేసుకుంటారు. అలా.. ఉదయం 5 అయ్యేసరికే పాజిటివ్ మైండ్ సెట్ తో డేను ప్రారంభిస్తారు. ఆహారంలో కూడా పెద్దగా వెరైటీలు ఏం తీసుకోరు. అన్నం, పప్పు, ఒక కప్పు పచ్చిమిర్చి తీసుకుంటారట. అలాగే.. ఈయన బెడ్ పై అసలు నిద్రపోరు. చాపపైనే పడుకుంటారు. ఇలా.. ఆ కాలం నాటి పద్ధతులు పాటిస్తున్నారు గనుకే ఇంత యాక్టీవ్ గా ఉన్నారు మరి.
#WATCH | Mumbai: 127-year-old yoga guru, Padma Shri Swami Sivananda performs yoga at an event ahead of International Yoga Day on 21 June. pic.twitter.com/qKfoQflRgf
— ANI (@ANI) June 16, 2024
తన జీవితాన్నంతా సామాజిక సేవకే అంకితం చేశారు స్వామి శివానంద. 50 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. leprosy అనే వ్యాధితో బాధ పడుతున్న వాళ్లకి సాయం అందిస్తున్నారు. నిస్వార్థంగా పని చేస్తే ఎవరైనా ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బతకొచ్చని జీవిత పాఠం నేర్పుతున్నారు శివానంద.