Zodiac Signs: కౌగిలింతల్లో ఈ రాశుల వారికి ఫుల్ మార్క్స్
హగ్ ఇవ్వడం ఓ కళ. ఇందులో కళ ఏముందని మాత్రం అనకండి. ఎందుకంటే కొందరి సమక్షం ఉపశమనం కలిగిస్తే మరికొందరి సమక్షంలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు ఏ కోవకు చెందుతారో తెలుసుకోండి...
సంతోషం, బాధ, ఆవేదన ఇలా ఏ ఫీలింగ్ ల ఉన్నవారికైనా స్వాంతన చేకూర్చేది హగ్. ఆప్యాయంగా ఒక్క క్షణం హగ్ చేసుకుంటే చాలు మనసు ఒక్కసారిగా తేలికపడిపోతుంది. హడావుడి జీవితంలో అంత సమయం ఎక్కడుంటుందిలే అనే ఉద్దేశంతో హగ్ డే లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలకరింపులకు కూడా హగ్స్ ఇచ్చుకుంటున్నారు. అయితే హగ్స్ ఇవ్వడం కూడా ఓ కళండోయ్.. అందులో ఈ రాశుల వారు సిద్ధహస్తులట.
మిధునం
హగ్స్ ఇవ్వడంలో మిథున రాశివారు స్పెషలిస్టులట. భావోద్వేగాలతో నిండిన వెచ్చటి, కన్నీటి కౌగిలి ఇవ్వకుండా వీరు ఎవ్వరికీ వీడ్కోలు చెప్పలేరు. ఓదార్పుయాత్ర చేపట్టడంలో వీరిదే పైచేయి. మిథున రాశివారి నిజమైన ప్రేమ ముందు ఎవ్వరైనా దాసోహం కావాల్సిందే.
కర్కాటకం
ఒక్క హగ్ తో ఎదుటివారికి ఎంత ప్రత్యేకత నిస్తున్నారో చెప్పేస్తారట కర్కాటక రాశివారు. ఒక్కసారి కమిటై నేనున్నా అనే భరోసాతో హగ్ ఇచ్చారంటే జీవితాంతం వారి మాటలో మార్పుండదట. వీరు కౌగిలింతని చాలా సున్నితమైన అంశంగా, ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
సింహం
అడవికి రాజు సింహం అయితే హగ్స్ కి రారాజు సింహ రాశివారట. ఈ రాశివారు స్నేహం, శృంగారాన్ని కలగలపిన వెచ్చని కౌగిలింత అందిస్తారు. ఎదుటి వారి స్థితిని బట్టి వీరి హగ్స్ స్టైల్ మారుతుందట
కన్య
కన్య రాశివారు హగ్స్ ఎంతో సన్నిహితంగా, ఆప్యాయంగా ఉంటాయట. తమ మనసులో భావాల గురించి పెద్దగా ప్రదర్శించరు కానీ కౌగిలింతలతో వ్యక్తపరిచేందుకు ఇష్టపడతారు.
వృశ్చికం
ఎవరి కౌగిలింతనైనా స్వీకరించేందుకు వృశ్చికరాశివారు సిద్ధంగా ఉంటారట. అయితే ఈ రాశి వారు తమ భావాలను ఎక్కువగా వ్యక్తపరిచేందుకు ఇష్టంగా ఉండకపోవడంతో వీరికి ఎవరైనా సన్నిహితంగా ఉండేందుకు వస్తే సంతోషిస్తారట. వీరి హగ్స్ స్నేహపూర్వకంగా కాకుండా వ్యక్తిగతంగా ఉంటాయట.
మీనరాశి
అన్ని రాశులవారికకన్నా మీనరాశివారు చాలా జాలీగా ఉంటారట. ఇక హగ్స్ విషయంలో నీకన్నా ఎవ్వరూ ఎక్కువ లేరన్నట్టు ఉంటారట. నిస్వార్థమైన ప్రేమను అందిస్తున్నా అనే మాటని హగ్ ద్వారా తెలియజేయడంలో మీన రాశివారిదే పైచేయి.
Also Read: ఆ ఫీలింగ్స్ ఆడవారికే ఎక్కువట… వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదట…
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి