Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే
Diabetes: డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చాలా జాగ్రత్త పడమంటారు. కానీ చాలా మందికి వాటి లక్షణాలే తెలియవు.
Diabetes: మనిషన్నాక చెమట పడుతుంది, ఆ చెమట వాసన వస్తుంది. కానీ ఆ చెమట వాసనను బట్టి కూడా ఇంట్లో డయాబెటిస్ ఉందో లేదో తెలిసిపోతుందని చెబుతున్నారు వైద్యులు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు చెమట వాసన కూడా ప్రత్యేకంగా వస్తుంది. ఆ వాసనను బట్టి కూడా వారిలో శరీరలో డయాబెటిస్ ఉందన్న విషయాన్ని చెప్పేయచ్చు. అయితే డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా వాసన రావాలని లేదు. కొంతమందిలో ఇది జరుగుతుంది.
ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన శరీర వాసన ఉంటుంది. ఇది సాధారణంగా మీ చర్మంపై బ్యాక్టీరియా, చెమట మిశ్రమం వల్ల వస్తుంది. అలాగే హార్మోన్లు, ఆహారపు అలవాట్లు, ఇన్‌ఫెక్షన్లు, మందులు వల్ల కూడా కలుగుతుంది. అలాగే మధుమేహం వంటి ఆరోగ్యసమస్యలు అంతర్లీనంగా ఉండడం వల్ల కూడా శరీర వాసన మారుతుందని చెబుతున్నారు అంతర్జాతీయ వైద్యులు.మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, శరీర వాసన కాస్త తేడాగా ఉంటుంది. రక్తంలో చక్కెర-సంబంధిత కీటోయాసిడోసిస్ లు ఉంటాయని వైద్యులు నమ్ముతారు. శరీరంలో కీటోన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మీ రక్తం మరింత ఆమ్లంగా మారుతుంది, శరీరం నుంచి తీయటి పండ్ల వాసన వస్తుంది.
ఆ వాసనె ఎలా వస్తుంది?
డయాబెటిస్ ఉన్నప్పుడు, రక్తంలో చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉండదు. అప్పుడు కాలేయం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది, ఆ సమయంలో కీటోన్లు అని పిలిచే ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా అధిక స్థాయిలో కీటోన్లు ఉత్పత్తి అయినప్పుడు అవి రక్తం, మూత్రంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటాయి. దీని వల్ల రక్తం ఆమ్లంగా మారుతుంంది. ఈ కీటోన్లు మన శ్వాస, చెమట రూపంలో శరీరం నుంచి బయటికి వెళతాయి. దీని వల్ల శరీరం నుంచి వాసన వస్తుంది. కీటోన్లు అధికంగా బయటికి వెళుతున్నప్పుడు పండ్ల వాసన వస్తుంది. శ్వాసించినప్పుడు కూడా పండ్ల వాసన వస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను తనిఖీ చేసుకోవాలి. డయాబెటిస్ లక్షణాలు, సంకేతాలు ఏమీ కనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.
Also read: రష్యన్ గబ్బిలాలలో కోవిడ్‌లాంటి వైరస్, మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Also read: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే రక్త పరీక్ష ఇది, 40 ఏళ్లు దాటితే చేయించుకోవడం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.