Heart Attack: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే రక్త పరీక్ష ఇది, 40 ఏళ్లు దాటితే చేయించుకోవడం ఉత్తమం
Heart Attack: ఎంతో మంది హఠాత్తుగా వచ్చే గుండె పోటుతో మరణిస్తున్నారు. దీన్ని ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు కదా.
Heart Attack: గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటివి హఠాత్తుగా వచ్చేస్తాయి. వాటి లక్షణాలను పసిగట్టేలోపే వచ్చి ప్రాణాలు తీసేస్తాయి. రక్త పరీక్ష ద్వారా చాలా రోగాలను ప్రాథమిక దశలోనే కనిపెట్టేస్తున్నారు వైద్యులు. మరి గుండె పోటును వచ్చే అవకాశాలను కనిపెట్టలేరా? దానికి కూడా ఒక రక్త పరీక్ష ఉంది.కానీ దీనికి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ రక్త పరీక్స పేరు కార్డియో-సి రియాక్టివ్ ప్రొటీన్ (hsCRP). ఈ పరీక్షను తరచూ చేయించుకోవడం వల్ల గుండెపోటు రాకముందే, అది వస్తుందని వైద్యులు తెలుసుకోవచ్చు.
ఏంటీ పరీక్ష
కార్డియో - సి రియాక్టివ్ ప్రొటీన్ పరీక్ష అనేది శరీరంలోని సీఆర్పీ (సి రియాక్టివ్ ప్రొటీన్) స్థాయిని పసిగడుతుంది. శరీరంలో ఎక్కడైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సీఆర్పీ స్థాయిలో రక్తంలో పెరుగుతుంది. ఇక కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్ (hsCRP), సి రియాక్టివ్ ప్రొటీన్ (CRP) కన్న సున్నితంగా ఉంటుంది. కాబట్టి అది కూడా పెరుగుతుంది. మనిషిలో hsCRP స్థాయిలు పెరిగినప్పుడు అది ఆ వ్యక్తి గుండె ధమనులలో అడ్డంకులకు కారణం అవుతుంది. దీని వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్టు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి hsCRP పరీక్షను చేయించుకుంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. దాని స్థాయిలు అధికంగా అనిపిస్తే వైద్యులు గుండె పోటు రాకముందే చికిత్స మొదలుపెడతారు.
ఒక్కసారితో కాదు...
ఏదో ఒక్కసారి వెళ్లి ఆ పరీక్ష చేయించుకుంటే కుదరదు. మీకు ఛాతీలో నొప్పిగా అనిపించినప్పడు, విపరీతమైన నీరసం వచ్చినప్పుడు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబ చరిత్రలో గుండె పోటు ఉన్న వారు తరచూ ఈ పరీక్ష చేయించుకోవాలి. నిరంతర రీడింగులు తీస్తూ, వాటిలో మార్పులను గమనించడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాన్ని అంచనా వేస్తారు వైద్యులు. అధిక రీడింగులు నమోదవుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. మీకు సమీప భవిష్యత్తులో గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం.
కార్డియో సి-రియాక్టివ్ ప్రోటీన్ లేదా హెచ్‌ఎస్‌సిఆర్‌పి అనే పరీక్ష ఈ మధ్యనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొన్ని రకల వ్యాధులు, అనారోగ్యాల వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ వస్తుంది. ఒత్తిడి, ఏదైనా ఇన్ఫెక్షన్, రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వాటి వల్ల ఇన్‌ఫ్లమ్మేషన్ వస్తుంది. ఇది దీర్ఘకాలం ఉండడం శరీరానికి హానికరం. గుండె పోటు, ఆకస్మిక మరణం, యాంజియోప్లాస్టీ, బైపాస్ వంటి సమస్యలతో ఇది ముడిపడి ఉంటుంది.
40 దాటితే తప్పదు
నలభై ఏళ్లు దాటిన వారంతా కచ్చితంగా ఎప్పుటిప్పుడు గుండె ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవాలి. ఇందులో డయాబెటిస్, కొలెస్ట్రాల్, కాలేయం పనితీరు, మూత్రపిండాలు, ఛాతీ ఎక్స్ రే, ఈసీజీ, ఎకో కార్డియోగ్రఫీ వంటివి చేయించుకోవాలి.అధికరక్తపోటు, మధుమేహం, ధూమాపానం అలవాటు, మద్యపానం అలవాటు, ఊబకాయం ఉన్నవారైతే కచ్చితంగా ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలి.
Also read: DASH డైట్‌తో గుండెపోటు రాకుండా ముందే అడ్డుకోవచ్చు, ఇంతకీ ఏంటీ డైట్?