అన్వేషించండి

World Against Child Labour Day : ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరు బాల కార్మికులే.. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ ఇవే

Child Labour : బాల కార్మికులను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీని గురించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

World Against Child Labour Day 2025 Theme : ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను తీవ్రమైన సమస్యగా గుర్తించి.. దానిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా, బాలలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిని ఎప్పుడూ ప్రారంభించారు. ఈ స్పెషల్ డే ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ చరిత్ర

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి 2002లో మొట్టమొదటి సారిగా బాల కార్మికుల వ్యతిరేక ప్రపంచ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బాల కార్మికులకు రక్షణ కల్పించి సురక్షితమైన విద్యను అందించి పురోగతిని కల్పించడమే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికీ బాల కార్మికులను నిర్మూలనలో పురోగతి ఉన్నప్పటికీ..  దానిని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తున్నారు.  

బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ప్రారంభం నుంచి నిజమైన పురోగతిని చూసింది. అయితే కొవిడ్ మహమ్మారి, ఇతర సమస్యల వల్ల మరిన్ని కుటుంబాలు పేదరికంలోకి వెళ్లాయి. దీంతో మళ్లీ లక్షల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా చేస్తున్నారు. అంటే ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు కార్మికులుగా చేస్తున్నారు. 

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ప్రాముఖ్యత

ప్రతి పిల్లలకు బాల్యం అవసరం. ఈ విషయంపై తల్లిదండ్రులకు, కంపెనీలకు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నాయి. పిల్లలను బలవంతంగా పనికి పంపడానికి బదులుగా.. వారి అభివృద్ధి కోసం మంచి జీవితాన్ని అందించాలనే ఉద్దేశాన్ని ప్రధానంగా గుర్తు చేస్తుంది. సమాజంలో వారికి గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ స్పెషల్ డేని తీసుకెళ్తున్నారు. 

సస్టైనబుల్ డెవలప్​మెంట్​ గోల్స్​లో వివరించిన విధంగా 2025 నాటికి అన్ని రకాల బాల కార్మికులను నిర్మూలించే లక్ష్యంతో సమన్వయం చేస్తుంది. ఇదే గోల్ రీచ్​ అయితే SDGలో ఇది ఒక మైలు రాయి అవుతుంది. అందుకే బాల కార్మికుల నిర్మూలనలో నిబద్ధతతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నారు. 

ప్రపంచం బాల కార్మికుల వ్యతిరేక 2025 దినోత్సవం థీమ్

ఈ ఏడాది మనం సాధించి పురోగతిని, ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే అవసరాన్ని హైలైట్ చేస్తుంది. గత దశాబద్దంతో పోల్చుకుంటే బాల కార్మికులు 38 శాతం తగ్గారు. ఈ థీమ్​లో భాగంగానే బాల కార్మికులను నిర్మూలించడానికి మెరుగైన నివారణ, రక్షణ, భాగస్వామ్యాలకు పిలుపునిచ్చే డర్బన్ కాల్​ టు యాక్షన్​లో నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget