పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త.. వారికొచ్చే ఆరోగ్య సమస్యలివే..

మొబైల్​ ఎక్కువగా చూడడం వల్ల ఫటిగో, కళ్లు పొడిబారడం, మయోపియా వంటి కంటి సమస్యలు ఎక్కువ అవతాయి.

చిన్నతనంలోనే తలనొప్పి, మైగ్రెన్ వంటి ఇతర నొప్పులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

నిద్ర సమస్యలు వస్తాయి. పిల్లలు పడుకోవాల్సిన దానికంటే తక్కువగా నిద్రపోతారు. నిద్ర నాణ్యత తగ్గుతుంది.

పిల్లల్లో ఒబెసిటీ పెరగడానికి మొబైల్​ అతిపెద్ద ప్రధానకారణం. శారీరకంగా యాక్టివ్​గా లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

సరైన పొజిషన్​లో కూర్చోలేరు. దీనివల్ల మెడ, భుజాల్లో నొప్పులు మొదలవుతాయి.

యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు పిల్లల్లో అధికమవుతాయి. మానసికంగా వారిని కృంగదీస్తాయి.

ఫోన్ చూడడమనేది వ్యసనంగా మారుతుంది. దీనివల్ల నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి.

మొబైల్ ఉంటే పక్కన ఉన్న ప్రపంచాన్నే మరిచిపోతారు. దీనివల్ల ఏ పనిమీద దృష్టి పెట్టలేరు.

చదువుకోవాలన్న కోరిక తగ్గిపోయి.. మొబైల్​పై ఆసక్తి ఎక్కువ అవుతుంది.