(Source: ECI/ABP News/ABP Majha)
మహిళలూ జాగ్రత్త, శానిటరీ పాడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం?
శానిటరీ పాడ్స్ విషయంలో ఒక కొత్త షాకింగ్ విషయం బయటపడింది.
ఒకప్పటి పరిస్థితి వేరు. పూర్వం పీరియడ్స్ వచ్చాయంటే వస్త్రాలనే వాడే వారు మహిళలు. అవి సరిగా ఉతికి, ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. లేకుంటే బ్యాక్టిరియాలు చేరే అవకాశం ఉంది. చాలా మంది ఆ వస్త్రాలను వాడడం వల్ల అనారోగ్యం బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే శానిటరీ పాడ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇకసారి వాడి పడేసేవే. వీటినే ఇప్పుడు అందరూ వాడడం మొదలుపెట్టారు. నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా దీని వాడకం విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయంలో వీటి గురించి పెద్ద షాకింగ్ విషయం తెలిసింది.
కొత్త అధ్యయనం ప్రకారం శానిటరీ ప్యాడ్‌ల వాడకం వల్ల పర్యవరణానికే కాదు మహిళల ఆరోగ్యానికీ చాలా హాని చేస్తున్నట్టు తేలింది. ఓ ఎన్జీవో నిర్వహించిన పరిశోధనల్లో ఈ షాకింగ్ ఫలితం వచ్చింది. శానిటరీ ప్యాడ్‌లో ఉన్న కొన్ని రసాయనాలు మహిళల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నట్టు తేలింది. వీటిని దీర్ఘకాలంగా వాడే మహిళల్లో క్యాన్సర్, పిల్లలు కలగక పోవడం వంటి సమస్యలు వస్తాయని బయటపడింది. ఈ శానిటరీ ప్యాడ్‌ల ఉత్పత్తిలో క్యాన్సర్ కారకాలు, హానికర టాక్సిన్లు, అలెర్జీలు కలిగించే ఉత్పత్తులు ఉన్నట్టు అధ్యయనంలో తెలిసింది.
మనదేశంలో దొరికే పది సంస్థలకు చెందిన శానిటరీ ప్యాడ్ బ్రాండ్‌లపై ఈ పరిశోధన సాగింది. వీటన్నింటిలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు ఉన్నట్టు అధ్యయనకర్తలు కనుగొన్నారు. ఈ రెండూ కూడా మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తీవ్రంగా పెంచుతాయి. రుతుస్రావం సమయంలో ఈ ప్యాడ్స్ స్రీ జననాంగాలకు అతుక్కుని ఉంటుంది. ఆ సమయంలో ఈ విష రసాయనాలు శరీరంలో చేరే అవకాశం ఉంది.
భారతదేశంలో యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు. కాబట్టి ఈ ప్యాడ్‌లను రసాయన రహితంగా తయారుచేయాలని సూచిస్తున్నారు అధ్యయనకర్తలు.అలాగని పాతకాలంనాటిలా వస్త్రాలను వాడడం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే వాటిని పరిశుభ్రంగా క్లీన్ చేసి వాడకపోతే మరిన్ని అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.
వస్త్రాలను వాడాలనుకుంటే వాటిని బాగా ఉతికి, ఎండలో బాగా ఎండాక తిరిగి వాడాలి. కానీ కంటికి కనిపించని దుమ్ము ధూళి పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Also read: పచ్చిమిర్చి కోడి పులావ్ - ఇలా చేస్తే అదిరిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.