Silver Anklets : పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
ఆడపిల్ల పుడితే చాలు మొదట కొనేవి వెండి పట్టీలే. మన సాంప్రదాయంలో కాలి పట్టీలకు చాలా ప్రాధాన్యత ఉంది.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలు మెడలో గొలుసులు, చేతికి గాజుల, కాలికి పట్టీలు కచ్చితంగా ధరించాలి. అది ప్రాచీన కాలం నుంచి ఒక ఆచారంగా, సాంప్రదాయంగా వస్తోంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే సంబరంలో మొదట కొనేవి కూడా వెండి పట్టీలే. అందులో మువ్వలు లేదా గజ్జెల పట్టీలనే ఏరికోరి తెస్తారు. నట్టింట్లో ఆడపిల్ల పరుగులు తీస్తుంటే ఆ మువ్వల సవ్వడి ఇల్లంతా ప్రతిధ్వనించాలన్నది తల్లిదండ్రుల కోరిక. అలా ఆడపిల్ల నవ్వుతూ ఘల్లుఘల్లుమని తిరుగుతుంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే నడయాడుతున్నట్టు భావిస్తారు ఇంట్లోని పెద్దలు.
వెండిపట్టీలే ఎందుకు?
మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మొదట్నించి వెండి పట్టీలు ధరించడమే ఆచారంగా వస్తోంది. అందులోనూ వెండికి ఒంట్లోని వేడిని గ్రహించే శక్తి ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా వసరం. ఆరోగ్యపరంగా కూడా వెండిపట్టీలను ధరించడం చాలా మంచిది. అందుకే కొన్నప్పుడు తెల్లగా మిలమిలలాడే వెండి పట్టీలు... మనం పెట్టుకున్న కొన్ని రోజులకు నల్లగా మారుతాయి. అవి మన ఒంట్లోని వేడిని గ్రహించి అలా నల్లగా మారుతాయి.
బంగారు పట్టీలే పెట్టుకోవచ్చా?
చాలా మందికి బంగారు పట్టీలను చేయించుకోవడం ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా సంపన్నుల ఇళ్లల్లో ఇలాంటి బంగారు పట్టీలు కనిపిస్తుంటాయి. కానీ మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బంగారం అంటే లక్ష్మీదేవి. కాబట్టి బంగారు పట్టీలను కాలికి ధరించడం లక్ష్మీదేవిని అవమానపరిచినట్టేనని చెబుతారు పండితులు. ఆరోగ్యపరంగా కూడా బంగారు పట్టీల వల్ల ఉపయోగం ఉండదు. అది మన శరీరంలోని వేడిని గ్రహించదు. పైగా అధిక వేడిని కలుగుజేసే లక్షణాలు ఉంటాయి. అందుకే బంగారు పట్టీల కన్నా వెండి పట్టీలు అన్ని విధాల శ్రేయస్కరమని చెబుతున్నారు పండితులు.
Also read: రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటే... ఏడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి, ఎంత అదృష్టవంతురాలో
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి