అన్వేషించండి

Snakes on Medical Symbol: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?

వైద్య చిహ్నంలో పాములు, రెక్కలు, కర్ర వెనుక పెద్ద కథే ఉందండోయ్. ‘అపోలో’ దేవుడి కొడుకు, ‘హీర్మేస్’ అనే దేవదూతల కథల కలయికే ఈ చిహ్నం.

Snakes on Medical Symbol | రెండు పాముల మధ్య ఒక కర్ర, దానికి జత రెక్కలు కలిగిన వైద్య చిహ్నాన్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా? వైద్యంతో సంబంధం లేని పాములను ఆ సింబల్‌లో పెట్టడానికి కారణం ఏమిటీ? ఆ రెక్కలు దేన్ని సూచిస్తాయి? వాస్తవానికి ఇది ఒక పురాతన చిహ్నం. దీని వెనుక పెద్ద కథే ఉంది.

రెండు చిహ్నాలు, వేర్వేరు కథలు: వైద్యానికి సంబంధించి రెండు రకాల చిహ్నాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముందుగా రెక్కలు, పాములున్న చిహ్నం గురించి తెలుసుకుందాం. ఈ చిహ్నాన్ని ‘కాడ్యూసియస్’(caduceus) అని పిలుస్తారు. ఒలింపియన్ దేవుడు హీర్మెస్(Hermes) వద్ద ఒక స్టిక్ ఉండేది. గ్రీకు పురాణాల ప్రకారం.. దేవతలకు మనుషులకు మధ్య హీర్మేస్ దూతగా ఉండేవాడు. దేవదూత కావడం వల్ల అతడికి రెక్కలు ఉండేవి. ఒకప్పుడు రోగులు వైద్యుడిని కలిసేందుకు కాలినడకన ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. హీర్మేస్ వారి బాగోగులను చూసుకొనేవాడు. అందుకే, వైద్య చిహ్నంలో అతడి రెక్కలు, కర్రను చేర్చారు.

ముందు తెల్ల రిబ్బన్లు, ఆ తర్వాత పాములు: ‘అపోలో’ అనే దేవుడు అప్పటి ప్రజలకు వైద్యం అందించేవాడు. ఆయన హీర్మేస్‌కు సహకరించేందుకు సిబ్బందిని అందించాడు. దేవతల రాజు జ్యూస్ కూడా హీర్మేస్‌కు సిబ్బందిని ఇస్తాడు. వారిద్దరు ఇచ్చిన సిబ్బందిని రెండు తెల్లని రిబ్బన్లుగా సూచించేవారు. చిహ్నం తయారీలో మొదట కర్రకు అటూ ఇటు రెక్కలతోపాటు రెండు తెల్ల రిబ్బన్లు చేరో వైపు ఉండేవి. కాలక్రమేనా ఆ రిబ్బన్లను పాములతో భర్తీ చేశారు. ఓ కథ ప్రకారం.. పోట్లాడుకుంటున్న రెండు పాములను హీర్మేస్ తన కర్రతో వేరు చేసి శాంతపరిచాడట. అప్పటి నుంచి అవి అతడి సిబ్బందితో కలిసి సామరస్యంతో ఉండేవట. అందుకే వాటిని ఆ చిహ్నంలో చేర్చారట.
Snakes on Medical Symbol: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?

అపోలో దేవుడి కొడుకు హత్య: మరో వైద్య చిహ్నంలో రెక్కలు ఉండవు. కేవలం ఒక పాము మాత్రమే ఉంటుంది. దీన్ని ‘అస్క్లెపియస్’(Asclepius) అని అంటారు. అపోలో దేవుడు, మానవ జాతికి చెందిన యువరాణి కరోనిస్‌లకు కలిగిన కుమారుడే ‘అస్క్లెపియస్’. పురాణాల ప్రకారం అతను అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది రోగులను తిరిగి ఆరోగ్యవంతులను చేశాడు. చనిపోయినవారిని తిరిగి బతికించేవాడు. కానీ, అదే అతడికి శాపమైంది. చనిపోయినవారిని తిరిగి బతికిస్తూ ప్రపంచంలోని సహజ క్రమానికి భంగం కలిగిస్తున్నాడే కారణంతో జ్యూస్ దేవుడు.. పిడుగుపాటుతో అస్క్లేపియస్‌ను చంపేశాడు. దీనికి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మనుషులను తిరిగి బతికించేందుకు అతడు కానుకలు వసూళ్లు చేసేవాడని, అందుకే జ్యూస్ అతడికి మరణ దండన విధించారని అంటారు.Snakes on Medical Symbol: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?

అందుకే, రెండు వేర్వేరు వైద్య చిహ్నాలు: మరణం తర్వాత అస్క్లేపియస్‌ను జ్యూస్ నక్షత్రాల మధ్య ఓఫియుచస్‌(సర్పాన్ని మోసేవాడు)గా ఉంచాడు. గ్రీకులు పాములను పవిత్రంగా భావించేవారు. అస్క్లేపియస్‌ను గౌరవించడం కోసం వైద్య ఆచారాల్లో పాములను ఉపయోగించేవారు. పాము విషాన్ని నివారణ ఔషదంగా వాడేవారు. పాములు కుబుసం విడిచే ప్రక్రియ.. అంటే చర్మాన్ని వదిలి, కొత్త చర్మాన్ని పొందడాన్ని పునర్జన్మగా భావించేవారు. అందుకే, ఈ రెండు కథల ఆధారంగా ‘హీర్మేస్’ నిస్వార్థ సేవలు, ‘అస్క్లేపియస్’ వైద్య నైపుణ్యాలకు ప్రతీకగా దేవదూత రెక్కలు, ‘అస్క్లేపియస్’ పాములను వైద్య చిహ్నంలో చేర్చారని అంటారు. ప్రస్తుతమైతే ‘కాడ్యూసియస్’, ‘అస్క్లేపియస్’ చిహ్నాలు రెండూ వాడుకలో ఉన్నాయి. ‘అస్క్లేపియస్’ చిహ్నం(పాము, కర్ర)ను పురాతన గ్రీకు భవనాలపై కూడా చూడవచ్చు.

 Snakes on Medical Symbol: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?

Also Read: ఓ మై గాడ్, ఇతడి నాలుకపై జుట్టు పెరుగుతోంది, కారణం తెలిస్తే ఇక నిద్రపట్టదు!

Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Castor Oil for Hair : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Embed widget