అన్వేషించండి

Before death: మరణానికి ముందు మనిషిలో కలిగే ఆలోచనలు ఏమిటీ? మానసిక స్థితి ఎలా ఉంటుంది?

Before death: ప్రతి జీవికి మరణం తప్పదు. అలాగని.. జీవితంపై ఆశను చంపుకోలేరు. అందుకే, మరణించే సమయంలో వారి మదిలో కొన్ని ఆలోచనలు మెదలుతుంటాయట. ఇంతకీ ఆ సమయంలో ఏం ఆలోచిస్తారు? పరిశోధకులు ఏం చెబుతున్నారు?

Final Moments: ప్రతి మనిషికి చావు అనేది ఒక భయానక స్వప్నం. చావుతో జీవితం ముగిసిపోతుంది. శరీరాన్ని.. ఆప్తులను విడిచిపోవాలి. ఇలాంటి భయంకరమైన చేదు నిజాన్ని ఒక వ్యక్తి ఎలా జీర్ణం చేసుకుంటాడు.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరణం ఏ రూపంలోనై రావచ్చు. కొందరు జబ్బు చేసి చనిపోతూ ఉంటారు.. మరి కొందరు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది తప్పదు. కానీ మరణం నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందుకే తమని తాము ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. అయితే మరణించే సమయంలో ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. అతడు మానసికంగా ఎలా సంసిద్ధుడు అవుతాడు అనే అంశాలపై పరిశోధకులు కీలక విషయాలను తెలుసుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ ప్రముఖ పాలియేటివ్ కేర్ ఫిజిషియన్ చెప్పిన వివరాలివి.

పాలియేటివ్ కేర్ అనేది ప్రత్యేకమైన వైద్య సంరక్షణ. ఇది నొప్పి, తీవ్రమైన అనారోగ్య లక్షణాల నుంచి ఉపశమనం అందించే విభాగం. ఈ టీమ్‌కు చెందిన వైద్యులు మరణాన్ని సమీపిస్తున్న రోగి మానసిక స్థితిని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఒక రోగి తాను చనిపోయే ముందు తనకు అత్యంత ప్రియమైన వ్యక్తితో గడపాలని భావిస్తాడని పరిశోధనలో తేలింది. అలాగే కొందరు ఒక వ్యక్తి తన చేతిలో మోసపోయిన మరో వ్యక్తికి క్షమాపణలు చెప్పాలని కూడా భావిస్తారట. ఇలా ఒక్కో రోగి.. ఒక్కో విధంగా ఆలోచిస్తారట.

సాధారణంగా వృద్ధులు చనిపోయే ముందు తమ జీవితంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు. తమ ఆప్తులను కళ్లారా చూసుకోవాలి అని కూడా భావిస్తూ ఉంటారు. అయితే దీంతోపాటు వారు తమ సన్నిహితులతో చెప్పాలనుకున్న సంఘటనలను, బాధ్యతలను అప్పగించాలని ఆలోచిస్తారు. చనిపోయే ముందు నిర్లిప్తతతో.. తమ భావాలను ఇతరులతో ఎలా పంచుకోవాలో తెలియక సతమతం అయ్యే వారు కూడా ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేది సాధారణంగా ఎవరికి తెలియని పరిస్థితి. అయితే చాలామంది తాము మరణించే వేళ  కొద్ది క్షణాల ముందు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు వారి మెదడు కూడా అచేతనం అయ్యే అవకాశం ఉంది. తద్వారా వారికి మరణానికి సంబంధించిన సమాచారం తెలిసి ఉండకపోవచ్చు అని  పరిశోధనలో తేలింది. 

మరి కొంతమంది చనిపోయే ముందు తమకు ఇష్టమైనటువంటి పక్షులు, జంతువులను తలుచుకుంటారని కూడా ఈ పరిశోధనలో తేలింది. 12 నెలల లోపు  చనిపోయే అవకాశం ఉన్న వ్యక్తులపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిశాయి.

Also Read : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
Urine Leaking : తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget