Fenugreek seeds: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి
మెంతులతో బరువు కోల్పోవచ్చా? అయితే, మీరు రోజూ ఈ చిట్కా పాటించండి. తప్పకుండా ఫలితం ఉండవచ్చు.
చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు.. వంటింట్లో మీ బరువును తగ్గించే మెంతులను పెట్టుకుని, ప్రోటీన్ షెక్స్.. డైట్ అంటూ ఏవేవో ప్రయత్నాలు చేయడం ఎందుకు చెప్పండి? అయినా మెంతులు డయాబెటిస్ రోగులకు కదా? బరువును కూడా తగ్గిస్తాయ్? అనేగా మీ సందేహం?
ఔను, మెంతులు తప్పకుండా మీ బరువును తగ్గిస్తాయి. అయితే, అది మీరు తీసుకొనే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. మన వంటింటి మసాలాలకు ఆయుర్వేదంతో గొప్ప స్థానం ఉంది. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. వంటల్లో గుమగుమలే కాదు.. శరీరాన్ని చక్కగా, అందంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా అవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
మెంతుల్లో ఏముంటాయి?: మెంతుల్లో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయి. మీ శరీరానికి కావల్సిన రాగి, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, సి, కె, B6 ఇంకా ఎన్నో ఉన్నాయి. రోజూ మీరు మెంతులను తీసుకున్నట్లయితే తప్పకుండా బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. కాబట్టి, మీరు రోజూ మెంతి నీళ్లు తాగడం ఉత్తమం.
మెంతి నీటి వల్ల కలిగే ప్రయోజనాలు:
⦿ మెంతుల్లో నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు ఉండదు.
⦿ మెంతి నీటి వల్ల రక్తంలో చక్కెర నియంత్రణకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.
⦿ మెంతి నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి.
⦿ మెంతుల్లో ఉన్న విటమిన్-సి, కె కళ్ల వద్ద ఉండే నల్లటి వలయాలు, మొటిమలను తగ్గిస్తాయి.
⦿ మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అవి మహిళల్లో రుతుక్రమం వల్ల ఏర్పడే తిమ్మిర్లు, నొప్పిని తగ్గిస్తాయి.
⦿ బాలింతలు మెంతి నీరు తాగితే తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులోని ఫైటోఈస్ట్రోజెన్ శిశువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
మెంతి గింజల నీటిని ఇలా తయారు చేయండి: రోజూ ఒక చెంచా మెంతి గింజలను రాత్రి వేళ నీటిలో నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని స్టవ్‌పై పెట్టి ఉడికించండి. ఆ తర్వాత గింజలను వడకట్టి ఖాళీ కడుపుతో తాగేయండి. ఇలా చేయడం వల్ల మీ నడుము వద్ద పేరుకున్న కొవ్వు క్రమేనా తగ్గిపోతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం అవుతుంది. ఫలితంగా మీరు సులభంగా బరువు తగ్గుతారు. మెంతి గింజలలోని కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది.
Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.