అన్వేషించండి

Weight Loss with Meditation : మెడిటేషన్​తో బరువు కూడా తగ్గొచ్చట.. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయట

Weight Loss Tips : మెడిటేషన్​ అంటే కేవలం మైండ్​ని రిలాక్స్ చేసుకోవడానికి అనుకుంటారు కానీ.. దీనితో బరువు కూడా తగ్గొచ్చంటున్నారు. కానీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మంచి ప్రయోజనాలుంటాయట. 

Meditation for Weight loss : మెడిటేషన్​ అనేది మన మెదడును.. శరీరాన్ని కనెక్ట్ చేసే.. ఓ అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒత్తిడిని తగ్గించడం.. కాన్సంట్రేషన్​ని పెంచడం వంటివి చేస్తుంది. అయితే ఎక్కువమందికి తెలియని విషయం ఏంటంటే.. మెడిటేషన్​తో కూడా బరువు తగ్గొచ్చట. అయితే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే రిజల్ట్స్ ఎఫెక్టివ్​గా ఉంటాయంటున్నారు. ఇంతకీ ఆ టెక్నిక్స్ ఏంటి? మెడిటేషన్​తో నిజంగానే బరువు తగ్గొచ్చా? మెడిటేషన్​కి వెయిట్​ లాస్​కి ఉన్న లింక్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

కూర్చొన్న ప్లేస్​లోనే.. కళ్లు మూసుకుని.. బరువును తగ్గించే సత్తా మెడిటేషన్​కే ఉంది. బయటకు వెళ్లే అవకాశం లేనివారికి.. వర్క్​లో బిజీగా ఉండేవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే మెడిటేషన్​ చేసేప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. కచ్చితంగా బరువు తగ్గొచ్చని చెప్తున్నారు నిపుణులు. ఇది మీరు హెల్తీ లైఫ్​ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. మరి ఎలా మెడిటేట్ చేస్తే బరువు తగ్గొచ్చో.. మెడిటేషన్​తో బరువును తగ్గించే టిప్స్ ఏంటో చూసేద్దాం.

బరువు తగ్గేందుకు ఇలా మేడిటేషన్ చేయాలి..

మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండగలిగే రూమ్​ ఎంచుకోవాలి. లేదంటే పార్క్, మెడిటేషన్ స్టూడియోలను కూడా మీరు ఎంచుకోవచ్చు. కంఫర్ట్​బుల్ పొజిషన్​లో కూర్చోవాలి. మీ నడుమును వంచేయకుండా స్ట్రైయిట్​గా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరంపై ఒత్తిడి పెరగదు. ఈ పొజిషన్​లో ఉన్న తర్వాత.. ముక్కు ద్వారా.. స్లోగా డీప్​ బ్రీత్​లు తీసుకోవాలి. ఇప్పుడు స్లోగా నోటి ద్వారా బ్రీత్​ని వదలాలి. శ్వాసపై ధ్యాస ఉంచాలి. 

బ్రీత్ మీ శరీరంలోకి ఎలా వెళ్తుంది. శరీరం బయటకి ఎలా వెళ్తుందనే దానిపై ఫోకస్ చేయాలి. ఏమైనా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంటే.. వాటిపైకి దృష్టి వెళ్లకుండా.. బ్రీత్​పై ఫోకస్ చేస్తూ ఉండాలి. మీకు నచ్చిన ప్రదేశాన్ని.. నచ్చిన సన్నివేశాన్ని.. అందమైన ఫారెస్ట్, లేదా బీచ్​ని దృష్టికి తెచ్చుకోవాలి. అక్కడ మీరు ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు. 

మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే.. 

మెడిటేషన్​ను ప్రారంభించాలనుకుంటే.. తక్కువ సమయం నుంచి.. ఎక్కువ సమయానికి వెళ్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు మెడిటేషన్​లో కంఫర్ట్​బుల్​గా ఉంటారు. రోజుకు కనీసం పది నుంచి 20 నిమిషాలు మెడిటేషన్​లో ఉండేలా చూసుకోండి. ఏమి తింటున్నారు? ఏమి పని చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉంటారు. 

ఒత్తిడిని తగ్గించి.. 

శరీరంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. అవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్​ని పెంచుతాయి. ఇవి బెల్లీ ఫ్యాట్​ని పెరిగేలా చేస్తాయి. దీనివల్ల బరువు ఆటోమేటిక్​గా పెరుగుతుంది. అయితే మెడిటేషన్​తో ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడి ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి.

అలాగే ఒత్తిడిని తగ్గించుకోకుండా ఎంత కష్టపడినా.. బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. మెడిటేషన్​ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. పైగా స్ట్రెస్​ ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇవి కూడా బరువు పెరిగేలా చేస్తాయి. మేడిటేషన్ అన్​ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్​ని దూరం చేస్తుంది. 

మైండ్​ఫుల్​నెస్.. 

శరీరానికి ఏమి ఇవ్వాలి.. ఏమి ఇవ్వకూడదనే విషయాన్ని మెడిటేషన్ ఆలోచించేలా చేస్తుంది. చాలామంది తాము తీసుకునే ఫుడ్​పై అస్సలు దృష్టి పెట్టరు. సమయానికి ఏది దొరికితే అది తినేస్తారు. అలా దొరికే ఫుడ్స్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇది మీరు అన్​ హెల్తీ లైఫ్​ని లీడ్ చేసేలా చేస్తాయి. ఒబెసిటీ, బరువు వంటి సమస్యలను పెంచుతాయి. కానీ మెడిటేషన్​ వల్ల మీరు శరీరానికి ఏమి ఇవ్వాలి. ఏమి ఇవ్వకూడదనేది తెలుస్తుంది. దీనివల్ల ఫుడ్ కంట్రోల్ అవుతుంది బరువు తగ్గుతారు. 

నిద్రను మెరుగుపరిచి.. 

సరైన నిద్ర లేకుంటే బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కేవలం బరువే కాకుండా ఇతర ప్రాణాంతక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిన వాళ్లు రోజూ మెడిటేషన్ చేస్తే.. మెరుగైన నిద్ర వారి సొంతమవుతుంది. దీనివల్ల బరువు పెరగరు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిద్రలో బాడీ రీసెట్ అయ్యి.. మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. మెడిటేషన్​తో ఒత్తిడి, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది కాబట్టి మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. 

ఆ విషయంలో.. 

చాలామందికి బరువు తగ్గాలని ఉన్నా.. సరైన మోటీవేషన్ లేక ఆ ఆలోచనను విరమించుకుంటారు. కానీ మెడిటేషన్​ మిమ్మల్ని బరువు తగ్గాలనే లక్ష్యంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. మీరు చేయాలనుకునే వాటిపై ఫోకస్ చేయగలుగుతారు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. జిమ్​కి వెళ్లేందుకు మీకు వేరే మోటీవేషన్ అవసరం ఉండదు. మీరే.. రెగ్యూలర్​గా బరువు తగ్గడంపై దృష్టి పెట్టగలుగుతారు. 

ఇవే కాకుండా మెడిటేషన్ గట్ హెల్త్​ని కూడా ప్రమోట్ చేస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం జీర్ణమై.. శరీరంలో కొలెస్ట్రాల్​గా పేరుకుపోకుండా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గేలా శరీరాన్ని ప్రోత్సాహిస్తాయి. 

Also Read : ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్​లు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Viral News: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Embed widget