Trans Kitchen: ఇది ట్రాన్స్ జెండర్ల కిచెన్... పిల్లలకు, పేషెంట్లకు ఆహారం ఉచితం
తమిళనాడులోని మధురైలో ట్రాన్స్‌జెండర్ల కిచెన్ ప్రారంభించారు. అంతేకాదు, వీరు సమాజ సేవ కోసం పని చేసేందుకు ఈ పని చేసినట్లు వారు వివరించారు.
తమిళనాడులోని మధురైలో ట్రాన్స్‌జెండర్ల కిచెన్ ప్రారంభించారు. అంతేకాదు, వీరు సమాజ సేవ కోసం పని చేసేందుకు ఈ పని చేసినట్లు వారు వివరించారు. ఇందులో భాగంగానే వారు పిల్లలకు, పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు
ఈ కిచెన్ కోసం 10 మంది ట్రాన్స్‌జెండర్లు పని చేస్తున్నారు. వీరంతా గత 10 సంవత్సరాలుగా ఇంట్లో వంట చేసేవాళ్లే. వీరందరూ ఓ సారి కిచెన్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. అనంతరం దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేశారు. చివరికి వారు అనుకున్నది సాధించారు. కొద్ది రోజుల క్రితమే వారు జిల్లా కలెక్టర్ అనీశ్ శేఖర్ చేత ఈ కిచెన్‌ని ప్రారంభించారు.
Also Read: Shocking Video: ఛీ... ఈ ఫ్యాక్టరీలో రస్కులు ఎలా ప్యాక్ చేస్తున్నారో... చూడండి
ఈ హొటల్లో ఇడ్లీ, పొంగల్, బిర్యానీ, చేపల కూరతో పాటు వెజ్, నాన్ వెజ్‌లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. మధురైలోని గోరిపాల్యం ఏరియాకి దగ్గరలో రాజాజి ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రి సమీపంలోనే కిచెన్ ఏర్పాటు చేశాం. పిల్లలకు, పేషెంట్లకు ఉచితంగా ఆహారం ఇస్తామన్నారు. అనంతరం ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ జయచిత్ర మాట్లాడుతూ... భవిష్యత్తులో మరింత మంది ట్రాన్స్ జెండర్లు ఇలాగే హోటల్స్ ప్రారంభిస్తారని ఆశిస్తున్నా. ఇలా చేయడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా వారికి వారే జీవించగలరు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Avoid Reheating: ఈ ఐదు పదార్థాలను వేడి చేసి అస్సలు తినకండి... అలా తింటే లాభాల కంటే నష్టమే ఎక్కువ
Also Read: World Record: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
రూ. 6 లక్షల లోన్ తీసుకుని కిచెన్ ప్రారంభించినట్లు ట్రాన్స్ జెండర్ కుముంద తెలిపారు. వీటితో పాటు కొంతమంది ద్వారా అందిన ఫండ్స్‌తో ఈ కిచెన్ ప్రారంభించినట్లు చెప్పారు.
Also Read: Ganesh Chaturthi: IPS ఆఫీసర్ అవతారంలో గణేశ్... WELCOME చెప్పిన ముంబయి పోలీసులు