Pet to Travel in Style: పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేశాడు... రూ.2.5లక్షలు ఖర్చు చేశాడు
ఓ జంతు ప్రేమికుడు తనతో పాటు తన కుక్క ప్రయాణించేందుకు ఏకంగా విమానంలోని మొత్తం బిజినెస్ క్లాస్‌నే బుక్ చేశాడు.
కొంతమంది జంతు ప్రేమికులు తమ పెంపుడు కుక్కలు, పిల్లులకు సకల భోగాలు కల్పిస్తారు. తమతో పాటు సమానంగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. ఇంట్లో ప్రత్యేకంగా బెడ్స్ ఇలా అన్ని అందిస్తారు. తాజాగా ఓ జంతు ప్రేమికుడు ఒక అడుగు ముందుకువేసి తనతో పాటు తన కుక్క ప్రయాణించేందుకు ఏకంగా విమానంలోని మొత్తం బిజినెస్ క్లాస్‌నే బుక్ చేశాడు ఓ జంతు ప్రేమికుడు. ఈ సంఘటన ఏదైనా విదేశాల్లో జరిగిందేమో అనుకోకండి. మన భారత్‌లోనే. ఆ కుక్క ముంబయి నుంచి చెన్నైకి బిజినెస్ క్లాస్‌లో విలాసంగా వచ్చింది.
Also Read: Ganesh Chaturthi: IPS ఆఫీసర్ అవతారంలో గణేశ్... WELCOME చెప్పిన ముంబయి పోలీసులు
ఆ వ్యక్తి ఎవరన్న సమాచారం మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ సంఘటన కూడా తాజాగానే చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా AI-671 విమానం బుధవారం ఉదయం 9గంటలకు ముంబయి నుంచి బయలుదేరిన విమానంలో ఈ వింత చోటు చేసుకుంది. ప్రయాణికులు ఈ చోద్యన్ని చూసి ఆశ్చర్యపోయారు. Times of India సోర్స్ ప్రకారం... ఎయిర్ ఇండియా విమానంలోని J-క్లాస్ క్యాబిన్లో 12 సీట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని సదరు వ్యక్తి రూ.2.5లక్షలతో బుక్ చేశాడు. సాధారణంగా ఈ విమామనంలో ముంబయి నుంచి చెన్నై రావాలంటే ఒకరికి రూ.20వేలు ఖర్చు అవుతుంది.
భారత విమానయాన నిబంధనల ప్రకారం ఎవరైనా తమ పెంపుడు జంతువులనై కుక్కలు, పిల్లులు, పక్షులను విమానంలో కలిసి ప్రయాణించవచ్చు. ఒకొక్కరికి రెండు జంతువుల చొప్పున అనుమతి ఉంది. ఒక్కోసారి సదరు జంతువు ఆకారాన్ని బట్టి రెండింటి బదులు ఒకదాన్నే అనుమతించే అవకాశం ఇస్తారు.
Also Read: Gold Modaks: వామ్మో... కేజీ మోదక్‌లు రూ.12వేలా... ఏంటి ఈ మోదక్‌ల స్పెషల్?
విమానంలో తమ పెంపుడు జంతువులతో ప్రయాణించిన వారి గురించి వార్తల్లో అనేకసార్లు చదివాం. కానీ, ఇలా బిజినెస్ క్లాస్ బుక్ చేయడం మాత్రం ఇప్పుడే విన్నాం. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తన పెంపుడు నెమలితో విమానంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి.
Also Read: World Record: ఆ పిలగాడి వీపుపై సంతకాల మేళా... అదో ప్రపంచ రికార్డు
Also Read: Karnataka: ఊరికి రోడ్డేసే వరకు పెళ్లిచేసుకోను... యువతి శపథం... దిగొచ్చిన సీఎం