ఈ పెయిన్ కిల్లర్, నొప్పిని కాదు మనిషినీ చంపేస్తుందట - ఈ మాత్రతో మెదడు ఛిద్రం
ఇన్నాళ్లు మనం ఆ మాత్రలను చాలా సురక్షితం అనుకున్నాం. గుండె సమస్యలు, స్ట్రోక్స్ నుంచి రక్షిస్తుందని అనుకున్నాం. అయితే, అదే ఇప్పుడు మీకు ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. ఇంతకీ ఆ మాత్ర ఏమిటీ?
సొంత వైద్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా మందులు వేసుకుంటారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులకైతే తమకు తెలిసిన మాత్రలను మెడికల్ షాప్స్‌లో కొనుగోలు చేసి వాడేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. మాత్ర మోతాదు మించితే.. ప్రతికూల ప్రభావం చూపుతుంది. అది కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు అవుతుంది. తాజా స్టడీలో మరో షాకింగ్ విషయం తెలిసింది. పెయిన్ కిల్లర్స్ వల్ల మెదడులో నరాలు చిట్లి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు ఎక్కువగా సూచించే Aspirin (ఆస్పిరిన్) టాబ్లెట్ చాలా ప్రమాదకరమైనదని తెలిపారు.
స్ట్రోక్స్, గుండె సమస్యలతో బాధపడేవారు Aspirin మాత్రలను దగ్గర పెట్టుకోవడం మంచిదని చెబుతుంటారు. వైద్యలు కూడా వాటిని ఎక్కువగా సూచిస్తుంటారు. అయితే, స్ట్రోక్స్ రెండు రకాలు. అందులో ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ (Ischaemic stroke). రక్త నాళాలు బ్లాక్ అయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా ఈ స్ట్రోక్ వస్తోంది. మరొకటి.. హెమరేజిక్ స్ట్రోక్ (Hemorrhagic stroke). మెదడులో లేదా మెదడు చూట్టూ ఏదైనా కారణంతో రక్తస్రావం జరిగినప్పుడు ఏర్పడే బ్లడ్ క్లాట్స్ వల్ల స్ట్రోక్‌కు గురవ్వుతారు. అలాగే వయస్సు పెరిగే కొద్ది ఇలాంటి స్ట్రోక్స్ ముప్పు పెరుగుతుంది. ఈ స్ట్రోక్స్ మరణానికి కూడా దారితీయొచ్చు.
ఇలాంటి స్ట్రోక్స్ ఏర్పడినప్పుడు వైద్యులు Asprin మాత్రలను తక్కువ మోతాదులో తీసుకోమని చెబుతారు. ఈ మాత్రలు రక్తాన్ని పలుచగా మార్చి స్ట్రోక్స్ నుంచి కాపాడుతాయి. అయితే, తాజా స్టడీ ప్రకారం.. ఈ మాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా మెదడులో రక్తస్రావానికి కారణం కావచ్చని తేలింది. స్ట్రోక్స్ సమస్యలేని వృద్ధులకు ఆస్పిరిన్ సూచించినట్లయితే ముప్పు మరింత ఎక్కువ అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఐదేళ్లపాటు 70 ఏళ్లు పైబడిన 19,144 మంది వృద్ధులను పరిశీలించగా.. ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ అధ్యయన వివారానలు JAMAలో ప్రచురించారు.
ఈ పరిశోధనలో పాల్గొన్న సగం మందికి ప్రతిరోజూ తక్కువ మోతాదులో ఆస్పిరిన్, మిగిలిన సగం మంది ప్లేసిబో మాత్రలను ఇచ్చారట. ఆస్పిరిన్ తీసుకున్న వారిలో 1.5 శాతం మంది అధ్యయన కాలంలో ఇస్కీమిక్ స్ట్రోక్‌ను ఎదుర్కొన్నారు. ప్లేసిబో తీసుకున్నవారిలో 1.7 శాతం మందికి ఆ స్ట్రోక్స్ వచ్చాయి. ఆస్పిరిన్ తీసుకున్నవారిలో 1.1 శాతం మంది మెదడు, దాని చుట్టుపక్కల రక్తస్రావం జరిగినట్లు తెలుసుకున్నారు. ప్లెసిబో తీసుకున్నవారిలో అది 0.8 శాతం ఉంది.
ఈ నేపథ్యంలో ఆస్పిరిన్ అతిగా తీసుకోవడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు అతిగా ఆస్పిరిన్ వాడితే సమస్యలు తప్పవంటున్నారు. ఒక వేళా వాడాలి అనుకుంటే వైద్యులు సూచించే మోతాదులో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అతిగా ఆస్పిరిన్ తీసుకోనేవారిలో రక్తహీనత సమస్య కూడా పెరుగుతుందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. రక్తంలో ఐరన్ లోపం ఏర్పడినట్లయితే అనీమియా వస్తుంది. అజీర్ణం సమస్యలు కూడా ఏర్పడతాయట. చిన్న దెబ్బ తగిలినా.. త్వరగా రక్తస్రావం జరుగుతుంది. రక్తాన్ని ఆపడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
Also read : నిద్రలేవగానే బెడ్‌షీట్, తలగడలు ఇలా మారుతున్నాయా? అది క్యాన్సర్‌కు సంకేతం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial