నిద్రలేవగానే బెడ్‌షీట్, తలగడలు ఇలా మారుతున్నాయా? అది క్యాన్సర్‌కు సంకేతం!
క్యాన్సర్లు కూడా చిన్న అనారోగ్యాలుగా భావించి నిర్లక్ష్యం వల్ల తీవ్ర రూపం దాలుస్తాయి. అందుకే కొద్ది పాటి అవగాహన కలిగి ఉండడం అవసరం. ఈ అవగాహన మీకు సరైన కారణం తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది.
మీరు ఉదయం నిద్రలేవగానే తలగడ, బెడ్‌షీట్ చెమటతో తడిచి మురికిగా అనిపిస్తున్నాయా? అయితే, మీకు రాత్రిపూట చెమట ఎక్కువగా పడుతుందని అర్థం. అంతేకాదు.. అది మీకు రాబోయే క్యాన్సర్ ముప్పుకు కూడా సంకేతం. నిద్రలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయని ఏసీ ఉష్ణోగ్రతలు తగ్గించడం, లేదా ఫ్యాన్ స్పీడ్ పెంచడం వల్ల ఉపయోగం ఉండదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వేసవిలో కాకుండా అలా ప్రతిసారి చెమటలు పడుతున్నాయంటే.. అది క్యాన్సర్‌కు సంకేతమని గుర్తించాలి.
క్యాన్సర్ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. అయితే గమనింపులోకి వచ్చిన ప్రతి లక్షణాన్ని క్యాన్సర్ కావచ్చేమో అని భయపడడం సమంజసం కాదు. కానీ ఏదైనా అసాధారణమైన లక్షణం లేదా అనుమానస్పద విషయం కనిపిస్తే మాత్రం అశ్రద్ధ తగదు. మీరు శ్రద్ధ చూపించినప్పటికీ క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంబంధించిన లక్షణాలు ఇతర చిన్నచిన్న అనారోగ్యాలను పోలి ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి చిన్నచిన్న అనారోగ్యాలు కూడా క్యాన్సర్ వంటి పెద్దపెద్ద సమస్యల్లా కనిపిస్తాయి.
ఒక్కోసారి రాత్రి పూట చెమటలు పట్టడం అనేది క్యాన్సర్ లక్షణం కావచ్చు. వేసవిలో ఇలా జరిగితే వేసవిలో చాలా నిర్లక్ష్యం చేస్తాం. నిద్రలో చెమటలు పట్టడం చాలా సార్లు గుర్తించకపోవచ్చు. కానీ పొద్దున్నే మీరు నిద్రించిన బెడ్ మీద షీట్స్, దిండ్లను గమనిస్తే మీకు అర్థమవుతుంది. అవి చెమట వల్ల మురికిగా అనిపిస్తాయి.
క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో చెమటలు రావడానికి ఇన్ఫెక్షన్ ఒక కారణంగా చెప్పవచ్చు. శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నపుడు శరీరంలో వేడి పెరుగుతుంది. దాన్ని తగ్గించేందుకు చెమటలు ఎక్కువగా వస్తాయి.
క్యాన్సర్ మన శరీరంలోని నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ తో పోరాడేందకు ఏవిధంగా సన్నద్ధం అవుతుందో శరీరం అలాగే స్పందిస్తుంది. క్యాన్సర్ వల్ల లేదా క్యాన్సర్ చికిత్సల వల్ల కూడా హార్మోన్ స్థాయిలో మార్పుల వల్ల కూడా శరీరంలో హాట్ ఫ్లషెస్ రావచ్చు. హాట్ ఫ్లషెస్ కారణంగా చెమటలు ఎక్కువ పట్టవచ్చు.
రాత్రి పూట చెమటలు పట్టడం అనేది బోన్ క్యాన్సర్ లక్షణం కావచ్చని నిపుణులు అంటున్నారు. అదొక్కటే కాదు ఏదైనా క్యాన్సర్ ముదిరినపుడు ఈ లక్షణం కనిపించవచ్చట. అయితే బోన్ క్యాన్సర్ లో నిరంతరం ఎముక నొప్పిగా ఉంటుంది. సమస్య ప్రారంభంలో అప్పుడప్పుడు నొప్పి ఉంటుంది. కానీ ముదిరేకొద్దీ నొప్పి స్థిరంగా కొనసాగుతుంది. రాత్రి పూట లేదా ఏదైనా ఆక్టివిటిలో ఉన్నపుడు ఇది ఎక్కువగా ఉంటుంది. ఎముక పైన వాపు, ఎర్రగా కందిపోయినట్టు కనిపిసతుంది. క్యాన్సర్ సోకిన ఎముక కీలుకు దగ్గరగా ఉంటే కదలికలు కూడా కష్టం అవుతాయి.
రాత్రి సమయంలో చెమట చాలా ఎక్కువగా పడుతుంటే ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది. విపరీతమైన చెమట అనేది కేవలం క్యాన్సర్ వల్ల మాత్రమే కాకపోవచ్చు. అందుకే డాక్టర్ ను సంప్రదించి సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ డాక్టర్ కు కూడా అనుమానంగా ఉంటే ఆంకాలజిస్ట్ లేదా ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ కు సిఫారసు చేస్తారు.
Also read : అరచేతిలో అగ్గిపుల్ల స్వామి - పోట్లాటలకు దారితీస్తోన్న ‘ఫబ్బింగ్’, ఈ అలవాటు మీకుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial