Toilet Seat: టాయిలెట్‌లో టైంపాస్ చేస్తున్నారా? అయితే, ఈ భయానక వ్యాధులన్నీ మీ సొంతం!
టాయిలెట్ సీటు మీద అధిక మొత్తంలో బ్యాక్టీరియా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ వీటి ద్వారా వచ్చే వ్యాధుల మీద అవగాహన మాత్రం తక్కువ.
టాయిలెట్ సీట్లు సూక్ష్మక్రిములకు స్వర్గధామం లాంటిది. వీటిపై బ్యాక్టీరియా, ఇన్ఫ్లుఎంజా, స్ట్రెప్టోకోకస్, ఇ.కోలి, హెపటైటిస్, స్టెఫిలోకాకస్, సాల్మొనెల్లా, షిగెల్లా, నోరోవైరస్ సాధారణంగా కనిపిస్తాయి. అనేక ఆరోగ్య నివేదికల ప్రకారం టాయిలెట్ సీటులోని ప్రతి చదరపు అంగుళం మీద 50 కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల మీరు ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే టాయిలెట్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దీని వల్ల వచ్చే వ్యాధులు..
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఇది ఎక్కువగా టాయిలెట్ సీటు నుంచే వస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్ సీటు వల్ల సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించడం చాలా సులభం. యూటీఐ నుంచి సూక్ష్మక్రిములు మూత్రాశయం, మూత్రనాళం, కొన్ని సార్లు మూత్రపిండాలకు కూడా సోకుతుంది.
బ్యాక్టీరియల్ వజీనా
వజీనాలో బ్యాక్టీరియా అధికంగా చేరడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. వజీనా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. దీని వల్ల వజీనా దురద, చికాకు పెడుతుంది. మంటని కూడా కలిగిస్తుంది.
ప్రొస్టాటిటిస్
ఇది వస్తే తప్పనిసరిగా వైద్య చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపు కారణంగా పురుషుల ప్రొస్టేట్ ఉబబుతుంది. ఈ ఇన్ఫెక్షన్ జననేంద్రియాలు, గజ్జల ప్రాంతంలో ఏర్పడుతుంది. నొప్పితో కూడిన బాధ కలిగిస్తుంది. ఫ్లూ వంటి లక్షణాలు చూపిస్తుంది.
ఎస్టీడీలు
అపరిశుభ్రమైన టాయిలెట్ సీటు నుంచి లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది పబ్లిక్ రెస్ట్ రూమ్ ల వల్ల మాత్రమే వస్తుందని అనుకోవడానికి లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు శుభ్రంగా లేనివి ఎస్టీడీ ఇన్ఫెక్షన్ కి కారణమవుతాయి. ఇవి ఎక్కువగా చర్మం నుంచి చర్మానికి వ్యాపిస్తాయి. ఒకరకంగా అంటు వ్యాధి కిందకి వస్తుంది.
కాన్డిడియాసిస్
వజీనాలో ఈస్ట్ అధికంగా పెరగడం వల్ల ఎక్కువగా కాన్డిడియాసిస్ వస్తుంది. మహిళలు ఎక్కువ మంది దీని బారిన పడుతూ ఉంటారు. అపరిశుభ్రమైన టాయిలెట్ ని ఉపయోగిస్తుంటే మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మల విసర్జన చేసే ప్రాంతంలో ఈస్ట్ ఎక్కువగా చేరిపోతుంది. ఆ ప్రదేశంలో ఎక్కువగా తుడవడం వల్ల వ్యాధికారక క్రిములు వ్యాప్తి చెందుతాయి.
టాయిలెట్ సీటు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బాత్ రూమ్ వినియోగించిన తర్వాత తప్పని సరిగా చేతులని సబ్బుతో శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అపరిశుభ్రమైన చేతులతో మీరు ఏదైనా తిన్నా, తాగినా కూడా బ్యాక్టీరియా కడుపులోకి చేరి ఇన్ఫెక్షన్ బారిన పడతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సహజమైన చర్మ కాంతిని పొందాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial