News
News
X

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచిది. మారుతున్న జీవనశైలి, తినే ఆహార పదార్థాలు, అలవాట్ల కారణంగా గుండెని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

FOLLOW US: 
Share:

గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనకి మంచిది. శరీరంలో ఆక్సిజన్ తో కూడిన రక్తం, పోషకాలను నియంత్రించడం గుండె బాధ్యత. మారుతున్న జీవనశైలి, తినే ఆహార పదార్థాలు, అలవాట్ల కారణంగా గుండెని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా యువకుల్లో గుండె జబ్బులు త్వరగా వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ కూడా యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాని వల్ల చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెప్తోంది. గుండెని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మద్యపానం, ధూమ పానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవే కాదు మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలోనూ స్వల్ప మార్పులు చేసుకుంటే గుండెని కాపాడుకోవచ్చు.

గుండె జబ్బులతో బాధపడే వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. కేవలం గుండెని కాపాడేందుకు బైపాస్ సర్జరీ, యాంజియో ప్లాస్టి వంటి చికిత్సలు చేస్తారు కానీ గుండెకి ఉన్న ప్రమాదం మాత్రం అలాగే ఉంటుంది. ఇటువంటి సర్జరీలు గుండెకి రక్తం, ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తాయి. కానీ ధమనులు మాత్రం దెబ్బతినే ఉంటాయి. అంటే రోగికి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం మాత్రం అలాగే ఉంటుంది. ఆహారపు అలవాట్లని మార్చుకోవడం వల్ల గుండెని కాపాడుకోవచ్చు. మద్యపానం చెయ్యకపోవడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని 80% వరకు తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం గుండెపై సానుకూల ప్రభావం చూపడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీర్ఘకాలం పాటు గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ డైట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా మేలు.

ఏం తీసుకోవాలి?

గుండెని రక్షించుకోవడం కోసం కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన నూనెలు ఎంపిక చేసుకోవాలి. అల్పాహారంలో తాజా పండ్లు చేర్చుకోవాలి. ఒక గ్లాసు సిట్రస్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాలు, పెరుగు, తృణ ధాన్యాలు, గుడ్డులోని తెల్ల సొనతో చేసిన ఆమ్లెట్ తీసుకోవడం మంచిది. బ్రౌన్ రైస్, తృణధాన్యాలతో చేసిన రొట్టెలు చాలా మంచిది. వీటిలో ఫైబర్, పోషకాలు అధికంగా లభిస్తాయి. పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల స్ట్రోక్ తో చనిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చిక్కుళ్లు, చేపలు వంటి సీ ఫుడ్ కూడా మీ డైట్ లో భాగం చేసుకోండి. ఈ ఆహార పదార్థాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. మాంసానికి బదులుగా చేపలు ఉత్తమమైన ఎంపిక. ఖనిజాలు ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలని నియంత్రిస్తుంది. పాలు, పెరుగులో మెగ్నీషియం, కాలిష్యం పుష్కలంగా దొరుకుతాయి.

మనం తీసుకునే ఉప్పు, నూనెలు ఎక్కువ భాగం ప్రాసెస్ చేయబడినవే. అందుకే ఉప్పు తగ్గించాలి. గుండెకి ఆరోగ్యకరంగా ఉండే నూనెలని వాడుకోవాలి. కొలెస్ట్రాల్ కలిగించే నూనెల వినియోగం తగ్గించడం వల్ల గుండె సంబంధ వ్యాధులని సమర్థవంతంగా నిరోధించవచ్చు. రోజు మొత్తం మీద 1 తీ స్పూన్ ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండేందుకే ప్రయత్నించాలి. సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే

Also read: కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

Published at : 16 Aug 2022 04:11 PM (IST) Tags: Heart health Heart Problem Healthy food for Heart Avoid Heart Strokes

సంబంధిత కథనాలు

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!