By: ABP Desam | Updated at : 23 Jun 2023 07:52 PM (IST)
Representational image/Pexels
అధిక బరువు అన్ని విధాలుగా అనార్థాలు తీసుకొస్తుంది. బరువు తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహారంలో మార్పులు, కఠినమైన వ్యాయామం కూడా చేస్తారు. ఇవే కాదు మీ డైట్లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బరువు నిర్వహణలో ఇవి అద్భుతమైన ఫలితాలు చూపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు, మినరల్స్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉండటమే కాదు ఇవి క్రంచీగా, రుచిగా ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్ మెటబాలిక్ రేటుని పెంచుతాయి. వీటిలో ఖనిజాలు, ఎంజైములు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అధిక జీవక్రియ రేటుకు దారి తీస్తుంది. శక్తిని అందిస్తాయి. ఇవి ఎక్కువ కాలం పొట్ట నిండుగా ఉంచుతాయి. ఫైబర్ గొప్ప మూలం. ఆకలిని తీర్చి, అతిగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ సమానంగా తీసుకుంటే జీవక్రియకి అవసరమైన పోషకాలు అందుతాయి. బరువు నిర్వహణలో సహాయపడే కొన్ని డ్రై ఫ్రూట్స్ జాబితా ఇది..
ఎండుద్రాక్ష బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నానబెట్టిన ఎండుద్రాక్షలు పచ్చి ఎండు ద్రాక్ష కంటే మెరుగైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే నానబెట్టిన తర్వాత వాటిలోని పోషక విలువలు పెరుగుతాయి. చక్కెర తినాలనే కోరికలని నిరోధిచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అదనంగా ఇందులో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. అయోడిన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గించేందుకు పోషకమైన ఎంపికలు.
అత్తిపండ్లు లేదా అంజీర్ అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు నిర్వహణలో సంపూర్ణంగా సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. అంజీర్ లో లభించే పోషకాలు వేగవంతమైన జీవక్రియ రేటుని ప్రోత్సహిస్తాయి. వీటిలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వ్యాయామం చేసే సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. పొత్తి కడుపు దగ్గర పేరుకుపోయిన కొవ్వుని తగ్గిస్తాయి. ఇవి సహజంగానే తీపిగా ఉంటాయి. దీని వల్ల తీపి తినాలనే కోరిక తీరిపోతుంది. ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటుని నియంత్రిస్తాయి. తాజా పండ్ల కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.
అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారికి బాదం అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ. మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులని అందిస్తాయి. మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
ఖర్జూరంలోనూ ఫైబర్ ఉంటుంది. అందుకే ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో తప్పనిసరిగా వీటిని తీసుకుంటారు. అందుకు కారణం ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. విటమిన్ బి5 ఉంటుంది. శక్తిని పెంచుతుంది. వ్యాయామ పనితీరుని మెరుగుపరుస్తుంది. 100 గ్రాముల ఉత్పత్తిలో 282 కేలరీలు అందుతాయి.
ఇది చూసేందుకు కిస్మిస్ మాదిరిగానే ఉంటుంది. ఫినాలిక్ సమ్మేళనాల గొప్ప మూలం. యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కార్డియోవాస్కులర్ వ్యాధుల్ని తగ్గిస్తుంది. కొవ్వులు లేవు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ లతో నిండి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మన దేశంలో డయాబెటిస్, ఒబేసిటీ రోగులు ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Harmful Symptoms : మీ శరీరంలో ఈ మార్పుల సంకేతం అదే.. అస్సలు అశ్రద్ధ చేయకండి
Winter food: చలికాలంలో తినకూడని కొన్ని ఆహారాలు ఇవిగో
Hair Oil: తలకు నూనె రాసుకోకపోతే వెంట్రుకలకు నష్టమే
Papaya: బొప్పాయిని తిన్నాక ఈ ఆహారాలను తినకండి, మంచిది కాదు
Eat Tomatoes Everyday : రోజూ టమోటాలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎవరు తినకూడదు?
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
/body>