Foods for Weight Loos : ఈ ఫుడ్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి, అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తాయి
Healthy Summer Food : వేసవిలో బరువు తగ్గాలనుకుంటే కొన్ని ఫుడ్స్‌ని రెగ్యూలర్‌గా తీసుకోవాలి అంటున్నారు. అవి బరువు తగ్గడంలో హెల్ప్ చేయడమే కాకుండా.. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
Healthy Ways to Lose Weight : బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లాలి. జిమ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మోతాదులో శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు డీహైడ్రేషన్‌కు గురికావాల్సి వస్తుంది. అయితే కొన్ని ఫుడ్స్‌ని సమ్మర్లో రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి డీహైడ్రేషన్ నుంచి దూరం చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది అంటున్నారు. పైగా సమ్మర్లో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. అందుకే నీటితో పాటు.. ఫుడ్స్ తీసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మసాలా, ఘాటును కలిగించే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే.. శరీరం త్వరగా డీ హైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా ఉంచే ఫుడ్స్ తీసుకోవాలి. బరువు తగ్గడంలో హైడ్రేషన్ చాలా ముఖ్యమైంది. సమ్మర్లో చెమట ద్వారా కోల్పోయిన నీటిని పొందేందుకు మీ డైట్లో హైడ్రేటింగ్ ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. దీనివల్ల మీరు హైడ్రేటెడ్‌గా ఉంటూ.. బరువు తగ్గుతారు. ఈ వేసవిలో మీ ఆహారంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కీరదోస
సమ్మర్లోనే కాదు.. ఏ సీజన్లోనైనా కీరదోసలు ఆరోగ్యానికి చాలామంచివి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ మీకు కడుపు నిండేలా చేస్తుంది. వీటిని సలాడ్స్‌లలో లేదా నేరుగా.. డ్రింక్స్‌లలో కలిపి తీసుకోవచ్చు.
పుచ్చకాయ
వేసవిలో ఎక్కువమంది తినే పండ్లలో పుచ్చకాయ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. ఇది పూర్తిగా నీటితో నిండి.. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి హెల్ప్ చేసే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని డైరక్ట్‌గా తినొచ్చు. సలాడ్స్, జ్యూస్‌లలో కలిపి తీసుకోవచ్చు.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా ఉంచుతాయి. వీటిలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలోని ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా, హెల్తీ స్నాక్‌గా తీసుకోవాలి. ఓట్మీల్, స్మూతీలలో తీసుకోవచ్చు. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.
నారింజ
నారింజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ సి మీ ఆరోగ్యంతో పాటు.. చర్మానికి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని మీరు స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్, జ్యూస్‌లలో తీసుకోవచ్చు.
వీటితోపాటు పాలకూర, టమోటాలు, సెలరీ, బెల్ పెప్పర్స్ వంటి ఫుడ్స్ కూడా బరువు తగ్గడంలో, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తాయి. వీటిని పెద్దల నుంచి.. పిల్లల వరకు అందరూ హాయిగా తినొచ్చు. వీటితోపాటు రోజంతా పుష్కలంగా నీటిని తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు.. హైడ్రేటింగ్‌గా ఉంటారు.
Also Read : పక్షవాతానికి గురైన వ్యక్తి స్టెమ్ సెల్ థెరపీతో మళ్లీ నడవగలరా? ట్రీట్మెంట్ సక్సెస్ అయింది కానీ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.