News
News
X

Weight Loss: ఈ ఆహారం తీసుకున్నారంటే ఎప్పటికీ బరువు తగ్గలేరు!

బరువు తగ్గడం కోసం పోషకాలు నిండిన్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంతే కానీ ఖాళీ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే బరువు అదుపులో ఉండనే ఉండదు.

FOLLOW US: 
Share:

బరువు తగ్గడం కోసం సలాడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వాటితో పాటు ఖాళీ కేలరీలు ఉన్న ఆహారం కూడా తీసుకుంటారు. ఓ వైపు అవి తింటూనే బరువు తగ్గడం లేదు ఏంటా అని ఆలోచిస్తారు. ఖాళీ కేలరీలు అంటే అందులో కేలరీలు ఉండవని అర్థం కాదు వాటి వల్ల ఎటువంటి పోషకాలు శరీరానికి అందవని అర్థం. పైగా ఈ ఆహారాల్లో చక్కెర, కొవ్వుల నుంచి వచ్చే కేలరీలు వాటిలోని పోషకాల ప్రభావాన్ని తగ్గించేస్తాయి. ఖాళీ కేలరీలు తక్షణ శక్తిని అందించగలవు. కానీ కండరాలు ధృడంగా మారేందుకు అవసరమైన విటమిన్లు మాత్రం ఇవ్వలేవు. శక్తి కోసం ఉపయోగించని ఖాళీ కేలరీలు శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. దాని వల్ల నడుము, పిరుదులు, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. లావుగా కనిపించడమే కాదు బరువు పెరుగుతారు. అందుకే ఈ ఖాళీ కేలరీల ఆహారాన్ని పక్కన పెట్టేయాలి.

కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్

రుచికరమైన శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల దాహం అయితే తీరుతుంది. కానీ వాటి వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవి చక్కరతో నిండి ఉంటాయి. పోషకాలు ఉండవు. ఖాళీ కేలరీలు కలిగిన ఈ పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వీటి వల్ల శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ వెంటనే అది తగ్గిపోతుంది. ఇవి ఆకలిని తీర్చలేవు కాబట్టే మెదడు వాటిని ఇంకా కడుపు నిండే దాకా తినమని సంకేతాలు పంపిస్తుంది.

బేకరీ ఫుడ్ 

చాక్లెట్లు, జామ్ స్టఫ్డ్, క్రీమ్ పౌడర్డ్ షుగర్ కోటెడ్ కుక్కీలు, పేస్ట్రీలు, డోనట్స్, కేక్‌లు రుచిగా ఉంటాయి. కానీ వాటిలో చక్కెర, ఉప్పు శుద్ధి చేసిన పిండి ఉండటం వల్ల సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో వాపుకి కారణమవుతాయి. ఇవి తీసుకుంటే బరువు పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.

మద్యం

ఆల్కాహాల్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలి కోరికలని పెంచుతాయి. ఒక గ్రాములో ఏడు కేలరీలు ఉంటాయి. అంటే ఇది దాదాపు స్వచ్చమైన కొవ్వు కంటే ఎక్కువని అర్థం. ఇంకా వీటిలో పోషక విలువలు ఉండవు. శరీర జీవక్రియని దెబ్బతీస్తాయి. ఆల్కహాలిక్ డ్రింక్స్ ముఖ్యంగా కాక్ టెయిల్స్ లో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు

హామ్, సాసేజ్, హాట్ డాగ్, బేకన్ వంటి మాంసాలు సంతృప్త కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి ధమనులను మూసుకుపోయేలా చేస్తాయి. శరీరంలో మంటని కలిగిస్తాయి. సాధారణంగా ఈ మాంసాల్లో నైట్రేట్లు కూడా ఉంటాయి. ఇది డీఎన్ఏ ని దెబ్బతీస్తుంది. బరువు పెరిగేందుకు దోహదపడతాయి.

బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకుంటే మాత్రం ఈ ఆహార పదార్థాల జోలికి కూడా వెళ్లకూడదు. సాధారణంగానే ఇవన్నీ ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు. రుచికరంగా ఉంటాయి కానీ వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువ.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మీకు డయాబెటిస్ ఉందా? అయితే, బెండకాయ తినండి - ఎందుకంటే..

Published at : 11 Feb 2023 11:41 AM (IST) Tags: Weight Loss Tips Weight Gain Weight Loss Bakery Food Empty Calorie Food

సంబంధిత కథనాలు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?