Kidney Beans: కిడ్నీ బీన్స్ నానబెట్టి వండడం లేదా? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త
సరిగా ఉడికించిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంది.
కిడ్నీ బీన్స్ పచ్చివి అసలు తినకూడదు. పాయిజన్ తో సమానం. అందుకే వాటిని వండటానికి ముందు రాత్రంతా నానబెట్టి చేస్తారు. ఇతర చిక్కుళ్ళు, కాయ ధాన్యాలు మాదిరిగా కాకుండా కిడ్నీ బీన్స్ కాస్త గట్టిగా ఉంటాయి. అందుకే అవి మెత్తబడటం కోసం దాదాపు 7-8 గంటల సమయం పడుతుంది. లేదంటే అవి జీర్ణక్రియని ప్రభావితం చేస్తాయి.
సరిగ్గా ఉడకబెట్టకపోతే ఏమవుతుంది?
కిడ్నీ బీన్స్ రుచి, ఆకృతి వల్లే వాటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. కానీ వీటిని సరిగా ఉడికించకపోతే ఉబ్బరం వంటి పొట్ట సంబంధిత సమస్యల్ని కలిగిస్తుంది. ఇందులో లెక్టిన్, ఫైటోహెమాగ్లూటినిన్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి. వీటిని పచ్చిగా లేదా తక్కువ ఉడికించిన రూపంలో తీసుకుంటే హాని చేస్తుంది. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తాయి. అందుకే కిడ్నీ బీన్స్ నానబెట్టడం చాలా అవసరం.
నానబెట్టడం వల్ల ప్రయోజనాలు
కిడ్నీ బీన్స్ నానబెట్టడం వల్ల యాంటీ న్యూట్రీషియన్స్ ప్రభావం తగ్గుతుంది. ఇందులోని లెక్టిన్, ఫైటోహెమాగ్లూటిన్ లని యాంటీ న్యూట్రియంట్స్ గా పరిగణిస్తారు. ఇవి పోషకాల శోషణని నిరోధిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియకి ఆటంకం కలిగిస్తాయి. బీన్స్ నానబెడితే వీటి ప్రభావం తగ్గిపోతుంది. పోషకాల శోషణ మెరుగుపడుతుంది.
ఉబ్బరం తగ్గిస్తుంది
కిడ్నీ బీన్స్ సరిగ్గా నానబెట్టి ఉడికించడం వల్ల గ్యాస్, ఉబ్బరానికి దారి తీసే సమ్మేళనాలు స్థాయిలు తగ్గుతాయి. ఇందులోని చక్కెరలని విచ్చిన్నం అవుతాయి. గ్యాస్ సంబంధిత ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది.
ఎంజైమ్ లు పెంచుతుంది
బీన్స్ నానబెట్టడం వల్ల సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల విచ్చిన్నానికి దోహదపడుతుంది. ఈ ఎంజైమిక్ చర్మ జీర్ణక్రియని సులభతరం చేస్తుంది.
రుచి సూపర్
కిడ్నీ బీన్స్ నానబెట్టడం వల్ల వాటి ఆకృతి చాలా బాగుంటుంది. మెత్తగా అవుతాయి. రుచి కూడా అద్భుతంగా అనిపిస్తుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తాయి. నీళ్ళలో ఎక్కువ సేపు నానడం వల్ల వాటి బయట పొర కూడా మృదువుగా మారిపోతుంది.
కిడ్నీ బీన్స్ ప్రయోజనాలు
ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండెకి మేలు చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా చేస్తుంది. అది మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరంగా ఉంచుతుంది. గ్లూకోజ్ శోషణని మందగించేలా చేస్తుంది.
కిడ్నీ బీన్స్ ని రాజ్మా అని కూడా పిలుస్తారు. వీటిలోని ఫైబర్ కారణంగా పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకి అవసరమైన ఖనిజాలు, పోషకాలు అందిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే అదిరిపోయే టేస్టీ సమోసా తయారు చేసేసుకోవచ్చు