అన్వేషించండి

Samosa: ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే అదిరిపోయే టేస్టీ సమోసా తయారు చేసేసుకోవచ్చు

మార్కెట్లో దొరికే సమోసా టేస్ట్ ఇంట్లో కూడ రావాలని అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటిస్తూ సమోసా చేసుకోండి అదిరిపోతుంది.

భారతీయ చిరు తిండి లిస్ట్ లో మీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ మంది చెప్పే సమాధానం సమోసా. చల్లని సాయంత్రం వేళ మసాలా ఛాయ్ తో కలిపి సమోసా తింటుంటే అద్భుతంగా ఉంటుంది. అది భారతీయులకి కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు అదొక ఎమోషన్. ఒక నివేదిక ప్రకారం భారతీయులు రోజుకి 5 నుంచి 6 కోట్ల సమోసాలు లాగించేస్తున్నారట. భారత్ ఆర్థికాభివృద్ధికి సమోసా రూపంలో బాగానే డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో చేసిన సమోసా కంటే ఎక్కువ మంది బయట చేసిన వాటికి మొగ్గు చూపుతారు. అందుకు కారణం ఇంట్లో చేసేవి క్రిస్పీగా, టేస్టీగా రాకపోవడమే. ఈరోజు ప్రపంచ సమోసా దినోత్సవం. ప్రత్యేకమైన రోజుని మీ ఇంట్లోనే టేస్టీ సమోసా తయారు చేసి జరుపుకోండి.

ఇంట్లో సమోసాలు టేస్టీగా రాకపోవడానికి అతి పెద్ద కారణం పిండి కలిపే విధానమే. ఈ పద్ధతి ప్రకారం పిండి కలుపుకుని సమోసాలు చేసుకున్నారంటే ఇక మీకు బయట కొనుక్కుని తినాలనే ఆలోచన రాదు. పిండి కలిపేటప్పుడు తప్పనిసరిగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పిండి అటు మెత్తగా నీరు నీరుగా ఉండకూడదు అలగే గట్టిగా ఉండకూడదు. ఈ రెండింటిలో ఎలా ఉన్నా కూడా మీ సమోసా రుచి పూర్తిగా మారిపోతుంది. ఈ కొలతల ప్రకారం ఇంట్లోనే సమోసా చేసేసుకోండి.

సమోసా పిండి కలిపే పద్ధతి

ఒక పెద్ద పాత్రని తీసుకుని అందులో ఒకటిన్నర గిన్నె మైదా పిండి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పుతో పాటు 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి. నూనె లేదా నెయ్యి కలిపిన తర్వాత పిండి పిడికిలి చేస్తే అంటుకుంటుందో లేదో చెక్ చేసుకోవాలి. పిడికిలితో పిండి ఒత్తినప్పుడు గట్టిగా ఉంటే మీ సమోసా క్రిస్పీగా ఉంటుందని అర్థం. ఆ తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా చేసుకోవాలి. దాని మీద తడి వస్త్రం కప్పి ఉంచి కాసేపు నానబెట్టాలి.

ఈ చిట్కాలు తప్పనిసరి

మైదా పిండిలో నూనె లేదా నెయ్యి కలిపి కాసేపు అలాగే ఉంచుకోవాలి

పిండిలో నీళ్ళన్నీ ఒకేసారి కలుపుకోకూడదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి

పిండి చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా ఉండకూడదు

సమోసా రోల్ చేసేంత వరకు పిండి మీద తడి వస్త్రం అలాగే ఉంచాలి

పిండిలో మోమన్ లేదా నెయ్యి/నూనె బాగా వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా ఉంటాయి

సమోసా కూరకి బంగాళాదుంపలు పేస్ట్ గా కాకుండా ముక్కలుగా ఉంచుకుంటేనే మంచిది

సమోసా కూరకి కావాల్సిన పదార్థాలు

వామ్ము- అర టీ స్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

బంగాళాదుంపలు- ఉడికించినవి రెండు మీడియం సైజువి

జీలకర్ర- 1 టేబుల్ స్పూన్

అల్లం- 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి- అర టీ స్పూన్

ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్

ఎర్ర మిరపకాయ- 1 టేబుల్ స్పూన్

గరం మసాలా- అర టీ స్పూన్

చాట్ మసాలా- అర టీ స్పూన్

పచ్చిమిర్చి- ఒకటి

కొత్తిమీర- ఒక టేబుల్ స్పూన్

జీడిపప్పు- 8 లేదా 10 పప్పులు

ఎండు ద్రాక్ష- 15

తయారీ విధానం

ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో ఎర్ర మిరప పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని తడి మసాలా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ తడి మసాలా నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని కలుపుకోవాలి. తక్కువ మంట మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు వేసుకుని వేయించుకోవాలి.

ఇప్పుడు సమోసా కోసం కలిపి పెట్టుకున్న పిండి తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీ మాదిరిగా రుద్ధుకోవాలి. అందులో ఈ కూర పెట్టుకుని అంచులు అంటుకోవడానికి కొద్దిగా తడి చేయాలి. దాన్ని సమోసా షేప్ లో మడత పెట్టుకోవాలి. మరొక బాణలిలో నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. సమోసాలు మునిగే వరకు నూనె ఉండాలనే విషయం గుర్తు పెట్టుకోండి. అప్పుడే అవి చక్కగా ఫ్రై అవుతాయి. గోధుమ వర్ణం వచ్చే వరకు వాటిని వేయించుకుంటే సరిపోతుంది.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: జుట్టు రాలడాన్ని నివారించే హెయిర్ మాస్క్- సింపుల్ గా ఇంట్లోనే వేసుకోవచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Embed widget