News
News
X

Breakup: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే

మగవారు ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడానికి సాధారణంగా తొమ్మిది కారణాలు ఉంటాయిట.

FOLLOW US: 

అన్ని ప్రేమ కథలు సుఖాంతం కావు. కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి.ఒక్కటిగా కలిసిన ఆ ఇద్దరి దారులు  బ్రేకప్ అనే పదంతో వేరైపోతాయి. ముఖ్యంగా మగవారు తాము ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి మధ్యలోనే బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇవి. వీటిల్లో ఏవో ఒకటి అతిగా ప్రభావం చూపించి అతడిని బ్రేకప్ చెప్పేలా ప్రేరేపిస్తాయి. 

1. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి మనిషికి చాలా అవసరం. ఆ స్వేఛ్ఛ ప్రియురాలి వల్ల అతను కోల్పోయినట్టు ఫీలైనా లేక ప్రియురాలి అతి ప్రేమను, పొసెసివ్‌నెస్‌ను తట్టుకోలేకపోయినా బ్రేకప్ అంటాడు బాయ్ ఫ్రెండ్. 

2. అమ్మాయితో పాటూ ఉన్నప్పుడు అతనికి భవిష్యత్తు అందంగా కనిపించాలి. కానీ ఆమెతో తనకి మంచి భవిష్యత్తు లేదు, ఆమెతో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనిపించినప్పుడు వెంటనే ప్రేమకు గుడ్ బై చెప్పేస్తాడు. కనీసం దాని గురించి ఆమెతో చర్చించడానికి కూడా చాలా మంది అబ్బాయిలు ఇష్టపడరట. 

3. ప్రియురాలు దూరంగా ఉన్నప్పుడు ఉన్న అందమైన ఫీలింగ్, ఆమె అతడి ప్రేమను ఒప్పుకున్నాక ఊహించినంత అందంగా అనిపించకపోయినా అబ్బాయి పునరాలోచనలో పడతాడు. దూరంగా ఉన్నప్పుడు వ్యక్తిత్వం తెలియదు. ప్రేమతో దగ్గరయ్యాక అమ్మాయి వ్యక్తిత్వం, నడవడిక, మాటతీరు తెలుస్తాయి. అవేవీ తాను ముందుగా ఊహించినంత చక్కగా అనిపించకపోయినా అతడు బైబై చెప్పేస్తాడు. 

4. ఏం బంధం నిలబడాలన్న ఒకరిపై ఒకరికి కనిపించని ఓ డీప్ కనెక్షన్ ఉండాలి. అది లేనప్పుడు, ఆ లోతైన కనెక్షన్ ఏర్పడనప్పుడు ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఆ ఫీలింగ్ అతడిలో రాగానే బ్రేకప్ చెప్పేస్తాడు. 

5. అమ్మాయిల్లో చాలా మందికి ప్రియుడితో ఉన్నప్పుడు కూడా పక్క వాళ్ల గురించి మాట్లాడడం, ఫిర్యాదులు చేయడం, బయటివారిని విమర్శించడం అలవాటుగా ఉంటుంది. అలాంటివారిని అబ్బాయిలు ఇష్టపడరు. ఇలాంటి అమ్మాయిలను హ్యాండిల్ చేయలేక సగం మంది అబ్బాయిలు బ్రేకప్ చెబుతారు. 

 6. అమ్మాయి వల్ల తన కెరీర్ పాడవుతుందని అబ్బాయి భావించినా, లేక తాను అనుకున్న లక్ష్యం చేరడానికి ప్రేమే అడ్డంకి అనుకున్నా కూడా వెంటనే బ్రేకప్ చెప్పేస్తాడు.లేదా తనకోసం కొన్నేళ్లు వెయిట్ చేయమని, ఈ మధ్యలో తనతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని చెబుతాడు.

7. స్నేహంగా ఉండే అమ్మాయినే మగవారు కోరుకుంటారు. బాసిజం చూపించే ప్రియురాలిని ఎక్కువ కాలం భరించలేరు. ఎవరైతే ఎప్పుడు డిమాండింగ్ మాట్లాడడం, బాసిజం చూపించడం వంటి లక్షణాలున్న అమ్మాయిని ఇష్టపడరు మగవారు. తమ దారి తాము చూసుకుంటారు.

8. తన జీతాన్ని, ఉద్యోగాన్ని తక్కువ చేసి మాట్లాడే అమ్మాయిలో ప్రేమను కంటిన్యూ చేసేందుకు అబ్బాయి మనసు ఒప్పుకోదు. డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయి అనిపిస్తే వెంటనే బ్రేకప్ చేసుకుంటారు. 

9. మోసం చేసే అమ్మాయిలను, అబద్ధాలు చెప్పేవారికి కూడా ఎక్కువ కాలం భరించరు అబ్బాయిలు. నమ్మకం లేని ప్రేమ నిలబడదు. అందుకే బ్రేకప్ చెప్పేస్తారు మగవారు. 

Also read: చెవులు కుట్టించడం ఆభరణాలకు కాదు, దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, చెబుతున్న ఆయుర్వేదం

Also read: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి

Published at : 23 Aug 2022 03:05 PM (IST) Tags: Love Breakup reasons Breakup in love Couple breakup

సంబంధిత కథనాలు

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

పెరుగు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోందో చూడండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Food Poisoning: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!