Money Trees: ఆ ఊళ్లో చెట్ల నిండా నాణాలే... ఎవరైనా దొంగిలిస్తే కష్టాలే
బ్రిటన్లోని ఆ గ్రామంలో చెట్లన్ని నాణాలతో కళకళలాడుతాయి. ఆ చెట్లను చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు వచ్చివెళుతుంటారు.
డబ్బులు చెట్లుకు కాస్తాయా? మన దగ్గర తరచూ వాడుకలో ఉండే వాక్యం ఇది. కానీ యూకే లోని ఓ గ్రామానికి వెళితే అది నిజమేననిపిస్తుంది. అక్కడున్న చాలా చెట్ల నిండా నాణాలే ఉంటాయి. వాటిని ఎవరూ తీసుకోరు కూడా. ఒక్కో చెట్టుకు కొన్ని వేల నాణాలు ఉంటాయి. ఈ వింత కనిపించేది బ్రిటన్లోని కొండలపై ఉండే పోర్ట్ మేరియన్ అనే గ్రామంలో.
పోర్ట్ మేరియన్ గ్రామానికి కొద్ది దూరంలో పెద్ద పెద్ద చెట్లు పడిపోయిన స్థితిలో కనిపిస్తాయి. వాటిపై చాలా నాణాలు దిగబడినట్టు కనిపిస్తాయి. ఆ చెట్లు కూడా ఈనాటివి కావు వందల ఏళ్ల నాటివి. ఆ చుట్టుపక్కల అలాంటి చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్లపై ఉన్న అనేక నాణాలు ఇప్పుడు చెలామణిలో లేనివే. ఎక్కువగా అన్నీ రెండు పైసల నాణాలు. పర్యాటకులు ఆ నాణాల చెట్లను చూసేందుకే ప్రత్యేకంగా వెళతారు. వీటిని తొలిసారి 2011లో కనిపెట్టారు. ఇలా చెట్లకు ఎవరు, ఎందుకు నాణాలను మేకుల్లా దిగకొట్టారని తెలుసుకునేందుకు చాలా మంది పరిశోధకులు రంగంలోకి దిగారు. దగ్గర్లోని అన్ని గ్రామాల్లోని ప్రజలతో మాట్లాడారు. వారిలో ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నప్పుడు వారు విన్న కథలు అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరికి నాణాల చెట్ల వెనుక అసలు కథను ప్రపంచానికి చెప్పారు.
(Image Credit: Pixbay)
చెట్లే దేవతలు...
ఈ నాణాలన్నీ దాదాపు 17వశతాబ్ధం నాటివే. అప్పుడు ఇక్కడి ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది. ఈ చెట్లని వారు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా కొలిచేవారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, లేక ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్నా... ఇలా ఒక కాయిన్ తెచ్చి చెట్టుకి మేకులా కొట్టేవారు. అలా దాదాపు వేల మంది చేయడం వల్ల చెట్లన్నీ నాణాలతో నిండిపోయాయి. అనారోగ్యం పాలైన వ్యక్తి తన చేతులతో తానే ఆ నాణాన్ని చెట్టుకు కొట్టాలన్న నమ్మకం కూడా ఉండేదట అప్పటి ప్రజల్లో. ఆ నాణాన్ని ఎవరైనా లాగే ప్రయత్నం చేస్తే రోగాలబారిన పడతారని నమ్మేవారు. అందుకే వాటిని తీయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ప్రస్తుతం అక్కడికి దగ్గర్లో ఉన్న గ్రామాల్లో మాత్రం ఇలాంటి నమ్మకాలేవి లేవు. తమ పూర్వీకుల ఆచారాలు, నమ్మకాలు చాలా మటుకు కాలగర్భంలో కలిసిపోయాయని చెబుతున్నారు వాళ్లు.
కేవలం బ్రిటన్ లోనే కాదు, దాదాపు అన్ని దేశాల్లోనూ పూర్వపు ప్రజల ఆచారాలు కాలం మారే కొద్దీ మరుగున పడుతున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Also reda: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి
Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి
Also read: గుంటనక్క నేనేనా? క్లారిటీ కోసం రవి పాట్లు, విశ్వ-రవిల మధ్య చిచ్చు పెట్టిన నటరాజ్ మాస్టర్