Top Beaches List : జనవరిలో ట్రిప్‌కు వెళ్లాలనుకుంటే.. ఇండియాలోని టాప్ బీచ్‌ల లిస్ట్ ఇదే
January Destinations : సంక్రాంతి సెలవుల్లో కొందరు సొంతూర్లు వెళ్తుంటారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు వెళ్తుంటారు. మీరు అలా ట్రిప్‌కు వెళ్లాలనుకుంటే ఇండియాలో ఈ బీచ్‌లకు వెళ్లొచ్చు.
Beach Destinations in India : పిల్లల నుంచి పెద్దలవరకు దాదాపు అందరూ సంక్రాంతి సెలవులు తీసుకుంటారు. ఈ సమయంలో పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు కొందరు సొంత ఊర్లకు వెళ్తే.. మరికొందరు వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు. మీరు జనవరిలో లాంగ్ వీకెండ్ సమయంలో లేదా పండుగల సమయంలో బీచ్‌లకు వెళ్లాలనుకుంటే ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మీరు బీచ్ పర్సన్ అయితే.. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఇండియాలోని కొన్ని బీచ్‌లకు మీ డెస్టినేషన్ ఫిక్స్ చేయొచ్చు. జనవరిలో మీకు సౌకర్యంగా ఉండే బీచ్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షద్వీప్
ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌లో ఉంటుంది. ట్రెండ్‌లో లేకపోయినా ఇండియాలోని లక్షద్వీప్‌ను మీరు జనవరిలో విజిట్ చేయగలిగిన ప్రదేశాల్లో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు బీచ్ సౌందర్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ ఎన్నో సముద్ర జీవులు చూడొచ్చు. వాటర్ గేమ్స్ ఆడవచ్చు.
గోకర్ణ బీచ్
కర్ణాటకలోని గోకర్ణ బీచ్ జనవరిలో వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. ఇక్కడ మీరు అద్భుతమైన సూర్యస్తమయాన్ని చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడికి ఈజీగా వెళ్లొచ్చు. గోకర్ణలో మీరు జెట్ స్కీ రైడ్, బనానా బోట్ రైడ్, పారాసైలింగ్, సర్ఫింగ్ వంటివి ట్రై చేయవచ్చు. మీరు ఇక్కడ ఆత్మలింగ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.
పుదుచ్చేరి
బంగాళా ఖాతం తీరంలో తమిళనాడు హద్దుగా పుదుచ్చేరి ఉంటుంది. ఇండియాలో మీరు వెళ్లగలిగే ప్రసిద్ధ గమ్యస్థానాల్లో ఇది ఒకటి. ఇక్కడ మీరు ప్రశాంతమైన బీచ్‌లు చూడొచ్చు. బీచ్‌లు, గోల్డెన్ కలర్లో ఉండే ఇసుక మీకు చక్కని రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. ఇక్కడ అద్భుతమైన బీచ్ రిసార్ట్లు ఉంటాయి. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రత్యేకం.
వార్కల బీచ్
కేరళలోని వార్కల ఓ పట్టణం. ఇది అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ ఎర్రటి శిఖరాలు బాగా ప్రసిద్ధి చెందినవి. ఇవి మీకు మంచి సీనరీ లుక్ ఇస్తాయి. ఫోటోలు దిగేందుకు ఇది చాలా అనువైన ప్రదేశంగా చెప్తారు. అలాగే పర్యాటకుల కోసం కేరళ ప్రభుత్వం ఇక్కడ ఎల్లప్పుడూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ సమీపంలోని కొండపై ఉన్న పురాతన హిందూ పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు. అందుకే ఇక్కడ పవిత్ర జలాలు ఉన్నాయని భావిస్తారు.
గోవా
ఇండియాలో బీచ్‌లు అంటే గోవా లేకుండా ఉండనే ఉండదు. ఇక్కడ సముద్ర తీరం పార్టీలు చేసుకునేందుకు చాలా అనువైన ప్రదేశం. బీచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి మీరు ఇక్కడికి వెళ్లి చిల్ అవ్వొచ్చు. ఇక్కడ అడ్వెంచర్ రైడ్స్ చాలానే ఉంటాయి. పిల్లలను కూడా ఇవి ఆకట్టుకుంటాయి.
ఇవే కాకుండా మీరు అండమాన్, నికోబార్ దీవులకు కూడా వెళ్లొచ్చు. కేరళలో కోవలం బీచ్, కన్యాకుమారి కూడా జనవరిలో వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు. కాబట్టి మీరు ఈ జనవరిలో ఎలాంటి ట్రిప్ అయినా ప్లాన్ చేసుకుంటే ఈ బీచ్‌లకు చెక్కేయండి.
Also Read : లక్షద్వీప్ వెళ్తున్నారా? అయితే ఇవి తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి