Summer Food: వేసవిలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే తినాల్సిన 10 సూపర్ ఫుడ్స్ ఇవే
వేసవి సమీపిస్తున్న కొద్దీ కొన్ని పండ్లు, కూరగాయల వినియోగం పెరుగుతుంది. ఎందుకంటే అవి మనల్ని హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, అవసరమైన పోషకాలు మరియు ఎలక్ట్రోలైట్‌లను కూడా అందిస్తాయి.
Summer Food: వేసవి కాలం వచ్చేసింది. ఈ సమయంలో మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో డీహైడ్రేషన్, వేడిగాలులు, వడదెబ్బ వంటి సమస్యల ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మంచి ఆహారం పట్ల శ్రద్ధ చూపడం ద్వారా, వేసవిలో వచ్చే ఈ ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. వేసవి సమీపిస్తున్న కొద్దీ కొన్ని పండ్లు, కూరగాయల వినియోగం పెరుగుతుంది. ఎందుకంటే అవి మనల్ని హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్‌లను కూడా అందిస్తాయి. మరి వేసవిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆ 10 సూపర్ పుడ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల వేసవి కాలంలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.
వేసవిలో తినాల్సిన 10 ఆరోగ్యకరమైన పుడ్స్
1. పుచ్చకాయ: పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఎండాకాలంలో దీన్ని తినడం వల్ల శరీరంలో నీటి కొరత సమస్య దరిచేరదు. ఇందులో అవసరమైన ఎలక్ట్రోలైట్‌లు కూడా ఉంటాయి, ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో లైకోపీన్ కూడా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎండ వల్ల దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
2. దోసకాయ: దోసకాయ నీరు, ఎలక్ట్రోలైట్లతో కలిసి ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది శరీరాన్ని చల్లబరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా దోసకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
3. కొబ్బరి నీరు: కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్ పానీయం, ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కానివ్వదు. శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
4. పుదీనా: పుదీనా శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా మీకు ఎప్పుడూ ప్రెష్‌గా ఉన్న అనుభూతి కలుగుతుంది.
5. పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పెరుగు కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉండే అద్భుతమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
6. పైనాపిల్: బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పైనాపిల్‌లో ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పండు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్‌లో విటమిన్ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
7. టొమాటోలు: టొమాటోలో లైకోపీన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. టొమాటోలో ఉండే విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది.
8. పచ్చని ఆకు కూరలు: ఆకుపచ్చని ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఆకుపచ్చని కూరగాయలు శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించడంతో పాటు శరీరాన్ని చల్లబరిచే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
9. నిమ్మకాయ: నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలోని వేడిని కూడా తొలగిస్తుంది.
10. సోంపు గింజలు: సోంపు గింజలు శరీరానికి చల్లదనాన్నిఅందించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. సోపు గింజలను తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది.