అన్వేషించండి

Salt Affects Brain: ఉప్పుతో మెదడుకు ముప్పు? షాకింగ్ విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం

ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే, జాగ్రత్త. అది మీ మెదడుకు ముప్పుగా మారవచ్చు. దీనిపై పరిశోధకులు జరిపిన లోతైన అధ్యయనం జరిపారు. దాని ఫలితం ఇలా ఉంది.

ఆహారం రుచిగా ఉండాలంటే ఉప్పు ఉండాల్సిందే. అంతేకాదు శరీరానికి కూడా ఉప్పు అవసరమే. కానీ, అది తగిన మోతాదులో మాత్రమే ఉండాలి. లేకపోతే.. అది కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. కొంతమంది రుచి కోసం ఉప్పు ఎక్కువగా ఉండే వంటకాలనే తింటారు. దాని వల్ల అప్పటికప్పుడు రుచి లభిస్తుందేమో.. కానీ, భవిష్యత్తు మాత్రం అది అస్సలు మంచి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జార్జియా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు తెలిశాయి. న్యూరాన్, మెదడులోని లోతైన రక్త ప్రవాహానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ అధ్యయనం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు వల్ల మెదడు ఎలా ప్రభావితమవుతుందనే అంశంపై షాకింగ్ విషయాలను తెలిపారు. 

న్యూరాన్లు యాక్టీవ్‌గా ఉన్నప్పుడు.. మెదడులో రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది. ఈ సంబంధాన్ని న్యూరోవాస్కులర్ కప్లింగ్ లేదా ఫంక్షనల్ హైపెరెమియా అని అంటారు. ఇది ఆర్టెరియోల్స్ అని పిలువబడే మెదడులోని రక్త నాళాల విస్తరణ వల్ల ఏర్పడుతుంది. ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోర్స్ ఇమేజింగ్ (fMRI) అనేది న్యూరోవాస్కులర్ కప్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా వైద్యులు మెదడు సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి బలహీనమైన రక్త ప్రవాహం గల ప్రాంతాలను గమనిస్తారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు ఈ విధానం ద్వారా మెదడులోని ఉపరితల ప్రాంతాలకు(సెరిబ్రల్ కార్టెక్స్) మాత్రమే పరిమితమయ్యాయి. అయితే, మెదడులోని లోతైన ప్రాంతాలను పరిశీలించలేదు. 

జార్జియాలోని న్యూరోసైన్స్ ప్రొఫెసర్, యూనివర్సిటీ సెంటర్ ఫర్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అండ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ జేవియర్ స్టెర్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు సంయుక్తంగా సర్జికల్ టెక్నిక్స్ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఆహారం తిసుకొనేప్పుడు, మద్యపానం, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు, పునరుత్పత్తి సమయంలో మెదడులోని లోతైన ప్రాంతమైన హైపోథాలమస్‌‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపోథాలమస్‌లో రక్త ప్రవాహం ఎలా మారుతుందనేది పరిశీలించింది.

ఈ అధ్యయనం గురించి డాక్టర్ జేవియర్ స్టెర్న్ వివరిస్తూ.. ‘‘శరీరంలో సోడియం(ఉప్పు) స్థాయిలను చాలా ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ స్టడీలో ఉప్పును ఎంచుకున్నాం. మీ రక్తంలో ఎంత ఉప్పు ఉందో గుర్తించే నిర్దిష్ట వ్యవస్థ కూడా మా వద్ద ఉంది. ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మెదడు దానిని గ్రహించి, సోడియం స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఉప్పు వాసోప్రెసిస్ అనే యాంటీడియురేటిక్ హార్మో్న్ విడుదలను ప్రేరేపించే న్యూరాన్‌లను యాక్టీవ్ చేస్తుంది. హైపోథాలమస్‌లో న్యూరాన్లు యాక్టీవ్ కావడం వల్ల రక్త ప్రవాహం తగ్గినట్లు గమనించారు. గత అధ్యయనాల్లో ఈ విషయాన్ని గుర్తించలేదు’’ అని ఆయన తెలిపారు. 

Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

సాధారణంగా అల్జీమర్స్, స్ట్రోక్ లేదా ఇస్కీమియా వంటి వ్యాధుల విషయంలో వైద్యులు రక్త ప్రవాహంలోనే హెచ్చు తగ్గులను గమనిస్తారు. తాజా పరిశోధనలో 50 నుంచి 60 శాతం అధిక రక్తపోటు ఉప్పు వల్లే ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అతిగా ఉప్పు తీసుకోవడం లేదా జీవితకాలంలో అధిక ఉప్పును వాడటం వల్ల వాసోప్రెసిన్ న్యూరాన్‌ల హైపర్యాక్టివేషన్‌ ఏర్పడుతుంది. ఇది హైపోక్సియాను ప్రేరేపిస్తుంది. దీని వల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుందని పరిశోధకులు తెలిపారు. ఇది అనేక మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి.. ఉప్పును వీలైనంత తక్కువగా వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు. 

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget