అన్వేషించండి

Tips to Better Sleep : రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? 3-2-1 రూల్​తో పాటు బెటర్ స్లీప్ టిప్స్ ఇస్తోన్న నిపుణులు

Struggling to Sleep : ఏమి చేసిన నిద్ర రావట్లేదు అనుకునేవారు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇవి లైఫ్​స్టైల్​ని బ్రైట్ చేయడంతో పాటు మెరుగైన నిద్రను కూడా అందిస్తాయి.

3-2-1 Sleep Formula : నిద్ర రాకపోవడం, మధ్యరాత్రిలో లేవడం, మెలకువ వచ్చిన తర్వాత నిద్ర త్వరగా రాకపోవడం, తక్కువ సమయం మాత్రమే నిద్రపోవడం వంటివి నిద్రలేమి సమస్యలుగా చెప్తారు. సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినడం వల్లే ఇలా జరుగుతుంది. దానిని రీసెట్ చేయాలంటే 3-2-1 రూల్ ఫాలో అవ్వడంతో పాటు లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలి.

నిద్రకోసం పిల్లో, పరుపు మార్చుకోవడం వంటివి బహిరంగా మార్పులు కాదు.. శరీరంలోని అంతర్గతంగా కొన్ని మార్పులకు సిద్ధం కావాలి. ఎందుకంటే సరైన నిద్ర లేకుంటే.. శరీరంలో శక్తి తగ్గుతుంది. దేనిమీద కూడా ఫోకస్ చేయలేరు. మానసికంగా, శారీరకంగా కృంగిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. 

3-2-1 రూల్ 

ఈ 3-2-1 రూల్ మెరుగైన నిద్రను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నిద్రకు మూడు గంటల ముందు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడే పనులు చేయకూడదు. రెండు గంటల ముందే ఫుడ్ తీసుకోవడం ఆపేయాలి. హెవీగా, స్పైసీగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇక గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండాలి. ఫోన్, ల్యాప్​టాప్, టీవీలను దూరంగా ఉంచాలి. ఈ చిన్న మార్పును ఎంత త్వరగా అలవాటు చేసుకుంటే.. అంత మంచి ఫలితాలు పొందుతారు. 

సన్ రైజ్ అవసరమే.. 

మంచి నిద్ర కావాలంటే.. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలి. లేచిన వెంటనే ఫోన్ పట్టుకోకుండా.. సహజమైన కాంతిని అంటే సూర్యరశ్మి శరీరానికి అందించాలి. ఇది సిర్కాడియన్ రిథమ్​ను రీసెట్ చేస్తుంది. మెదడుకు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని సూచిస్తుంది. దీనివల్ల రాత్రుళ్లు మెదడు ఒత్తిడి లేకుండా రిలాక్స్ అవ్వగలుగుతుంది. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.

బెడ్​ రూమ్​ ఎలా ఉండాలంటే.. 

బెడ్​ రూమ్​లో లైట్స్​ లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రూమ్​లో మీకు సరిపోయే టెంపరేచర్ ఉండాలి. బెడ్​రూమ్​ వీలైనంత క్లీన్​గా ఉంచుకోవాలి. అప్పుడే గజిబిజి, గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సౌండ్స్ లోపలికి రాకుండా చూసుకోవాలి. లేదా మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకుని రెస్ట్ తీసుకోవాలి. దీనివల్ల నిద్ర త్వరగా వస్తుంది. 

టైమ్ అంటే స్లీప్.. స్లీప్ కావాలంటే టైమ్

వారంలో వీకెండ్స్ అనే ఆలోచన కూడా లేకుండా టైమింగ్స్ ఫాలో అవ్వాలి. రోజూ మీరు 10కి పడుకుంటే.. ప్రతి రోజూ అదే సమయానికి పడుకోవాలి. అలాగే ఉదయాన్నే 5కి లేస్తుంటే.. రోజూ అదే సమయానికి నిద్రలేవాలి. ఇలాంటి ఓ షెడ్యూల్​ని బ్రెయిన్​కి అలవాటు చేసేస్తే.. రాత్రి 10 అయ్యేసరికి మీకు నిద్రవచ్చేలా చేస్తుంది. ఇది అంతర్గతంగా నిద్ర సమస్యలను దూరం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. 

ఇవే కాకుండా కెఫిన్ వంటి డ్రింక్స్ నిద్రకు ముందు తీసుకోకూడదు. ఈవెనింగ్ తీసుకుంటే రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ, టీలు తీసుకోకపోవడమే మంచిది. అలాగే పడుకునేముందు బాడీని కాస్త స్ట్రెచ్ చేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేసి పడుకున్నా మంచిదే. అలాగే పడుకున్నప్పుడు కళ్లు నిమిషం పాటు బ్లింక్ చేసినా కూడా నిద్ర త్వరగా వస్తుంది. కాబట్టి మీకు నిద్ర సమస్యలుంటే వీటిని ఫాలో అయిపోండి. అలాగే ఎక్కువకాలం ఈ సమస్యలు కొనసాగితే వైద్య సహాయం తీసుకోండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget