అన్వేషించండి

Chicken Karam Podi : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న చికెన్ కారం పొడి రెసిపీ.. ఇంట్లోనే, సింపుల్​గా ఇలా చేసుకోండి

Andhra Chicken Karam Podi : చికెన్ కారం పొడి తినాలనుకుంటున్నారా ? అయితే ఇంట్లోనే దీనిని ఎలా చేసుకోవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈ కారం పొడిని అన్నంలో కలుపుకుని నెలరోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

Chicken Karam Podi Social Media Recipe : చికెన్​తో వివిధ రకాల వంటలు చేసుకుంటారు. దాదాపు అన్ని చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియోలో చికెన్ కారం పొడి బాగా ఫేమస్ అయింది. రుచిగా చేసుకోవడానికి కాదేది అనర్హం అంటూ.. చికెన్​తో కారం పొడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వంటకం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి ఈ టేస్టీ, సింపుల్ రెసిపీని ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయలు - 2 పెద్ద ఉల్లిపాయలు

కరివేపాకు - మీకు నచ్చినంత

వెల్లుల్లి - 15 రెబ్బలు

చికెన్ - 250 గ్రాములు (బోన్స్ లేనిది)

ఎండుమిర్చి - 10 నుంచి 15

ఘరం మసాలా - 1 టేబుల్ స్పూన్

మిరియాలు - చిటికెడు

ఉప్పు - రుచికి తగినంత

నూనె- డీప్​ ఫ్రైకి సరిపడేంత

తయారీ విధానం 

ముందుగా బోన్​లెస్ చికెన్ తీసుకోవాలి. ఉల్లిపాయలు పొట్టు తీసి.. పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. డీప్​ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకోవాలి. దానిలో చికెన్ ముక్కలు వేసుకుని పైన గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా వేయించుకోవాలి. చికెన్ అన్ని వైపులా బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు మిగిలినవి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అని అన్నీ ఒకేసారి కాకుండా విడిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి.. వెల్లుల్లి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ బాగా చల్లార్చుకోవాలి. 

వేయించిన పదార్థాలు చల్లారిన తర్వాత చికెన్ కాకుండా మిగిలిన పదార్థాలన్నీ మిక్సీ జార్​లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అవి బాగా గ్రైండ్ అయినా తర్వాత చికెన్​ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.. ఆ మిశ్రమంలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఘరం మసాలా, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ కారం పొడి రెడీ.

దీనిని మీరు వేడి వేడి అన్నంలో వేసుకుని హాయిగా లాగించేయవచ్చు. అయితే దీనిని బయట కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి.. ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చికెన్ కారం పొడిని ట్రై చేసేయండి.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
Skin Whitening Cream: రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
ప్రకృతి ఒడిలో కొలువైన ఈ ఆలయాలు వర్షాకాలంలో స్వర్గంలా ఉంటాయ్! శ్రావణ మాసంలో తప్పకుండా సందర్శించాలి!
ప్రకృతి ఒడిలో కొలువైన ఈ ఆలయాలు వర్షాకాలంలో స్వర్గంలా ఉంటాయ్! శ్రావణ మాసంలో తప్పకుండా సందర్శించాలి!
Roof Leakage Signs:రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవి? తొలి ఆరు నెలల టాప్ 15 లిస్ట్ విడుదల
2026 తొలి ఆరు నెలల్లో దేశాన్ని ఊపేసిన కార్లు ఇవే - టాప్ 15 జాబితాలో మారుతి హవా
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Embed widget