Weird: ఈమెది ఒక వింత ఫోబియా, అందుకే సూపర్ మార్కెట్ అద్దెకు తీసుకుని అలా చేస్తోంది
ఒక్కొక్కరికి ఒక్కో ఫోబియా ఉంటుంది. కొన్ని వింత ఫోబియాలు కూడా ఉంటాయి. అలాగే ఒక మహిళకు క్రిములంటే భయం.
అతిశుభ్రత పాటించేవాళ్లని చాలా మందినే చూసే ఉంటారు. అలాంటి వాళ్లకి జేజమ్మ ఈమె. చివరికి తాను షాపింగ్ చేసేటప్పుడు కూడా ఎవరూ ఉండకూడదట. అందుకే ఏకంగా సూపర్ మార్కెట్ నే వారానికి ఓ గంటపాటూ అద్దెకు తీసుకుని షాపింగ్ చేస్తోంది. కరోనా వైరస్ దెబ్బకి ఆమె మరింత అతి శుభ్రత పాటించే వ్యక్తిగా మారిపోయింది. ఆమె పేరు ఎమ్మా. భర్త పేరు లూకాస్. నివసించేది అమెరికాలో. వీరికోస చిన్నపాప కూడా ఉంది.
ఎమ్మా, ఆమె భర్తది ఓ వింత వ్యక్తిత్వం. బయటి వాళ్ల ఇంటికి వెళ్లరు, ఎవరినీ తమ ఇంటికి రానివ్వరు. కనీసం షాపులకు కూడా జనం కనిపిస్తే వెళ్లరు. కారణం జెర్మ్స్ (క్రిములు). మనిషి నుంచి మనిషికి సోకే క్రిముల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వాళ్ల భయం. అందుకే తమను తామే ఐసోలేట్ చేసుకున్నారు. లూకాస్ వారానికోసారి గంట పాటూ సూపర్ మార్కెట్ ను అద్దెకు తీసుకుంటాడు. ఆ సమయంలో ఎమ్మా తప్ప ఇతర కస్టమర్లు ఎవరూ లోపలికి వెళ్లడానికి వీల్లేదు. ఇందుకోసం వారు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి అదనంగా డబ్బును చెల్లిస్తున్నారు. ఎమ్మాకు తోడుగా పీపీఈ కిట్ వేసుకున్న ఒక్క సేల్స్ మేన్ మాత్రమే లోపలికి వస్తాడు. వారానికి సరిపడా సరుకులన్నీ కొనేసుకుంటారు ఆ జంట.
ఎమ్మా-లూకాస్ బాగా డబ్బున్న జంట. అందుకే ఇలా సూపర్ మార్కెట్ ను గంట పాటూ అద్దెకు తీసుకుని మరీ షాపింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మా చాలా సంతోషిస్తోంది. తమ దగ్గర డబ్బు ఉండబట్టే ఇలా నచ్చినట్టు చేయగలుగుతున్నామని చెప్పింది. వారు క్రిముల భయంతోనే హోటల్స్ లో ఉండడం, వేరే వాళ్ల ఇంటికి వెళ్లడం వంటివి చేయరు. అంతేకాదు విమానాలు కూడా ఎక్కరు. కేవలం తమ కారులోనే ఎక్కడికైనా వెళతారు.
లాటరీ టిక్కెట్ కొట్టి...
లూకాస్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లాటరీ టిక్కెట్ గెలిచాడు. భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి. వాటిని తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ ఏ పనీ చేయకుండా, ఇంటి వద్దే కాలం గడుపుతున్నారు. తమ కూతురిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే
Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి