News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే!

వర్షాకాలం అంటే ఒక రకంగా రోగాల సీజన్ అనే చెప్పుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు త్వరగా అనారోగ్యాల పాలవుతారు.

FOLLOW US: 
Share:

ర్షాకాలం వచ్చేసింది. వాతావరణంలో మార్పులతో పాటు అంటు వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు కూడా పలకరించేందుకు సిద్ధమైపోతాయి. ఇటువంటి టైమ్ లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. వర్షాకాలంలో ఫిట్ గా ఉండేందుకు అనేక చిట్కాలు ఉన్నప్పటికీ నిర్ధిష్టమైన ఆహార నియమాలు కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం ఎప్పుడు ముఖ్యమే. అందుకే ఈ సీజన్ లో కొన్ని పండ్లు, కూరగాయలు మీ ప్లేట్ లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రుచికరమైన భోజనం తిన్నా ఫీలింగ్ కూడా కలుగుతుంది.

విటమిన్ సి: మాన్ సూన్ సీజన్ లో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తినాలు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫలామేతయారీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడతాయి. సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

బీట్ రూట్: ఎర్రటి రంగు కలిగిన బీట్ రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. దీన్ని పచ్చిగా లేదా వండిన వెజ్జీ రూపంలో లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని ఇస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

జామున్: జామూన్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు, శరీరంలో శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో చర్మాన్ని రక్షించే ఆస్ట్రింజెంట్ గుణాలు జామున్ లో మెండుగా ఉన్నాయి.

ప్రొబయోటిక్స్: పెరుగు, మజ్జిగ, కెఫిర్, కూరగాయాల్లో ఉండే ప్రోబయోటిక్స్ గట్ లోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు దోహదపడతాయి. చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడేందుకు సహాయపడుతుంది.

నెయ్యి: వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిలో నెయ్యి ముఖ్యమైనది. నెయ్యి జీర్ణ రసాలని ప్రేరేపిస్తుంది. శరీరం పోషకాలని గ్రహించడంలో సహాయపడుతుంది. పెద్ద పేగు కండరాలు మృదువుగా చేసి వాటి సంకోచాన్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నెయ్యిలోని బ్యూటిరేట్ యాసిడ్ యాంటీ ఇంఫలామేతయారీ, పేగు మంతను అరికట్టడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

మొలకలు: మొలకలు ఆరోగ్యానికి మంచిది. వాటిని వర్షాకాలంలో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రోటీన్ రిచ్ మొలకలు అల్పాహారంలో తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సూక్ష్మక్రిములతో పోరాడేందుకు ఇవి సహాయపడతాయి.

పసుపు పాలు: ఈ సీజన్ లో ఎక్కువగా జలుబు ఇబ్బంది పెడుతోంది. దానితో పోరాడేందుకు పసుపు పాలు అద్భుతమైన రెమిడీ. ఇందులోని యాంటీ ఇంఫలామేతయారీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ ఎక్స్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పసుపు పాలు తాగండి .

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వానా కాలంలో నెయ్యి తినాలట - ఎందుకో తెలుసా?

Published at : 30 Jun 2023 08:00 AM (IST) Tags: Monsoon Diet Citrus Food Healthy Food Immunity Booster Super Food Healthy Lifestyle

ఇవి కూడా చూడండి

Using Phone At Bathroom: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

Using Phone At Bathroom: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి

Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి

Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్