Ghee in Monsoon Season: వానా కాలంలో నెయ్యి తినాలట - ఎందుకో తెలుసా?
సువాసన కలిగిన నెయ్యి ప్రతి ఒక్కరూ తినేందుకు చాలా ఇష్టంగా చూపిస్తారు. మాన్ సూన్ సీజన్ లో దీన్ని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు.
భారతీయులు ఆహారంలో నెయ్యి ఎక్కువగా వినియోగిస్తారు. పప్పు, నెయ్యి, ఆవకాయ అందరికీ ఫేవరెట్ ఫుడ్. చిన్న పిల్లలకు పెట్టె ఆహారంలో కూడా నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. విటమిన్స్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇఫ్లమేటరీ గుణాలతో పాటు ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. తినదగిన కొవ్వులు ఇందులో ప్రత్యేకమైనవి. అయితే వాతావరణానికి అణుగుణంగా నెయ్యి వినియోగం ఉంటే బాగుంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ వచ్చేసింది. ఈ టైమ్ లో తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
వానా కాలంలో నెయ్యి తింటే మంచిదా?
ఈ సీజన్ లో ఎక్కువగా ఫ్లూ, జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, డయేరియా వంటి వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సీజన్ లో అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెయ్యి ఈ టైమ్ లో ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
నెయ్యిలో బ్యూటీరేట్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థ, ఆరోగ్యకరమైన పేగులు బలమైన రోగనిరోధక శక్తితో ముడి పడి ఉంటాయి. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలతో కూడిన నెయ్యి చేర్చడం చాలా ముఖ్యం. దీన్ని తీసుకోవడం వల్ల ఇతర ఆహారాల నుంచి వచ్చే కొవ్వులో కరిగే ఖనిజాలు, విటమిన్లు గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇందులో చాలా ఎక్కువ స్మోకింగ్ పాయింట్ ఉన్నందున దీన్ని పప్పులు, కూరగాయలు లేదా డెజర్ట్ లో జోడించుకోవచ్చు.
జీర్ణక్రియ మెరుగు
వర్షాకాలంలో అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు లేదా జీర్ణవ్యవస్థలో మంతను కలిగించే అనేక కడుపు సమస్యలు ఇబ్బంది పెడతాయి. నెయ్యిని చేర్చడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. వికారం, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
జీవక్రియ పెంచుతుంది
నెయ్యిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ ను దూరంగా ఉంచుతాయి. జీవక్రియను పెంచుతాయి. శక్తిని ఉత్పత్తి చేసేందుకు కొవ్వు కణజాలాలు కాల్చివేసేందుకు దోహదపడుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.
మెదడుకు మేలు
నెయ్యి మెదడుకి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చర్మ సంరక్షణ
నెయ్యి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది. వర్షాకాలంలో తేమగా ఉండే సమయంలో సాధారణంగా వచ్చే మొటిమల సమస్యని దూరం చేస్తుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపుని అందిస్తుంది. డార్క్ స్పాట్ ని తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందేనా? లేకపోతే ఏమవుతుంది?