అన్వేషించండి

Senior Citizen Dating India:50 ఏళ్ల తర్వాత డేటింగ్! దేశంలో సెకండ్ ఇన్నింగ్స్‌పై ఇంట్రెస్టింగ్‌ స్టోరీ!

Senior Citizen Dating India:ఐ యామ్ సింగిల్, రెడీ టూ మింగిల్ అంటున్నారు సీనియర్ సిటిజన్స్‌. దీంతో 50 ఏళ్లు దాటిన వారంతా ప్రేమ, పెళ్లి కోసం డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆధునిక వృద్ధులు ప్రేమ, తోడు కోసం డేటింగ్ యాప్స్ వాడుతున్నారు.
  • ఒంటరితనం, మానసిక సమస్యల నివారణకు తోడు కోరుకుంటున్నారు.
  • సెలబ్రిటీలు, సామాన్యులు ఆలస్య వయసులో వివాహాలు చేసుకుంటున్నారు.
  • డేటింగ్ యాప్స్, మిక్చర్స్ ద్వారా వృద్ధులు భాగస్వాములను వెతుకుతున్నారు.

Senior Citizen Dating India:ఒకప్పుడు అరవై ఏళ్లు వచ్చాయంటే... ఆధ్యాత్మిక చింతన, మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం, విశ్రాంతి జీవితం మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ  ఆధునిక భారత వృద్ధతరం మాత్రం నాకొక గాల్‌ ఫ్రెండ్‌ కావాలిరా అంటూ పాడుకుంటున్నారు. యూత్‌తో పోటీ పడి మరీ డేటింగ్ యాప్‌ల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ప్రేమ, తోడు కోసం సెకండ్ ఇన్నింగ్స్‌ కోసం అడుగులు వేస్తున్నారు. విదేశాల్లో సాధారణమైన ఆటమ్నల్‌ రొమాన్స్‌ అంటే మలి వయసు ప్రేమ ఇప్పుడు భారత్‌లో కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. 

సింగిల్ మిక్చర్ కల్చర్

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా సింగిల్ మిక్చర్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వారు రిటైర్‌మెంట్‌ ప్లాన్లు, ఆరోగ్య విశేషాలు చర్చించుకుంటూనే తమకు నచ్చిన తోడును ఎంచుకుంటున్నారు. 

మానసిక, ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు...

భారత్‌లో సగటు ఆయుర్ధాయం 50 నుంచి 71 ఏళ్లకు పెరిగింది. అంటే రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా సుమారు రెండు దశాబ్దాల జీవితం మిగిలే ఉంటోంది. పిల్లలు విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో స్థిరపడటం వల్ల సుమారు 15 శాతం మంది వృద్ధులు నగరాల్లో ఒంటరిగా ఉంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఒంటరిగా ఉండటం మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటిపై అవగాహన పెరిగింది. 

కేవలం శారీరక ఆకర్షణ కంటే, మనసు విప్పి మాట్లాడే ఒక తోడు ఉండాలనే కోరిక వారిని ఈ దిశగా నడిపిస్తోంది. " మేం కూడా సంతోషంగా ఉండటానికి అర్హులమే" అనే భావన ఇప్పుడు బలపడుతోంది. 

లేట్ వయసులో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 57 ఏళ్ల వయసులో రూపాలి బరువాను వివాహం చేసుకున్నారు. జీవితంలో ఏ దశలోనైనా తోడు అవసరమని, సంతోషంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వారిద్దరూ కలిసి ఫిఫ్టీ ప్లస్ జిందగీ అనే యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా తమ ప్రయాణాన్ని పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి సుహాసిని ములే 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఒక శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. సమాజం ఒత్తిడి వల్ల కాకుండా, తనకు తోడు కావాలని అనిపించినప్పుడు మాత్రమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 

సామాన్యులు సైతం అదే బాటలో...

సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఈ బాటలో ఉన్నారు. కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ అనే వ్యక్తి తన తల్లి పడుతున్న కష్టాలు చూసి పునర్వివాహం చేశాడు. ఇది 2013లో సంచలనంగా మారింది. కునాల్ అశోక అనే ఇద్దరు బాల్య స్నేహితులు సుమారు 35 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అప్పటికే వారి భాగస్వాములను కోల్పోయారు. చివరకు 2023లో వాళ్ల 60వ ఏట వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 

వృద్ధుల కోసం డేటింగ్ యాప్‌లు 

టెక్నాలజీ కేవలం యువతకే కాదు, వృద్ధులకు కూడా వరంగా మారింది. నేడు భారతీయ వృద్ధులు ఉపయోగిస్తున్న టాప్ యాప్‌లు ఒకసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. 50 ప్లస్ క్లబ్‌ను కేవలం వీళ్ల కోసమే రూపొందించారు. ట్రూలీ మాడ్లీ ఏ యాప్ కూడా 50 ప్లస్ వాళ్లకు క్రియేట్ చేశారు. ఇందులో సబ్‌స్క్రిప్షన్‌లు కోవిడ్ తర్వాత భారీగా పెరిగింది. క్వాక్‌క్వాక్‌ అండ్ బాంబుల్‌ అనే యాప్‌ ప్రాంతీయ భాషల్లో సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇందులో ఉండే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయితే డేటింగ్ యాప్‌లలో పురుషులు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మహిళలు నేరుగా మిక్చర్స్, సిర్ఫ్‌ కాఫీ వంటి వెరిఫైడ్ సర్వీస్‌లను ఇష్టపడుతున్నారు. 

మోసాలు ఉంటాయి జాగ్రత్త!

ఇందులో కూడా మోసాలు జరుగుతున్నాయి. సామాజికంగా వారిపై దాడి జరుగుతోంది. కుటుంబ సభ్యులు కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. లేట్ వయసులో ఈ పిచ్చి పనులు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు డబ్బులు ఉన్న వ్యక్తులను చూసి షుగర్ డాడీ పేరుతో కొందరు మోసం చేస్తున్నారు. వారి వద్ద ఉన్న సంపద లాగేసుకొని జంప్ అవుతున్నారు. 

ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్లు ఎప్పుడు కూడా మొదటి పరిచయంలోనే మొత్తం సమాచారం పంచుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ అవసరాలను, తమ ఇబ్బందులను ముందుగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని చెబుతున్నారు. వారి సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా కలిసేందుకు ఒత్తిడి తీసుకొస్తే పబ్లిక్‌ ప్రదేశాల్లో కలవాలని చెబుతున్నారు. 

Frequently Asked Questions

మలి వయసు ప్రేమ అంటే ఏమిటి?

వృద్ధాప్యంలో ప్రేమ, తోడు కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడాన్ని మలి వయసు ప్రేమ అంటారు. ఇది ఇప్పుడు భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది.

వృద్ధులకు తోడు అవసరం ఎందుకు?

పెరిగిన ఆయుర్దాయం, పిల్లలు దూరంగా స్థిరపడటం వలన వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరితనం మానసిక ఆందోళన, డిప్రెషన్ కు దారితీస్తుంది. కాబట్టి, మానసికంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోడు అవసరం.

వృద్ధుల కోసం ఏ డేటింగ్ యాప్ లు ఉన్నాయి?

50 ప్లస్ క్లబ్, ట్రూలీ మాడ్లీ, క్వాక్‌క్వాక్‌ అండ్ బాంబుల్ వంటి యాప్ లు వృద్ధుల కోసం అందుబాటులో ఉన్నాయి. క్వాక్‌క్వాక్‌ అండ్ బాంబుల్ ప్రాంతీయ భాషలకు కూడా మద్దతు ఇస్తుంది.

వృద్ధుల ప్రేమ వ్యవహారాలలో ఎలాంటి మోసాలు జరుగుతాయి?

డబ్బున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొందరు 'షుగర్ డాడీ' పేరుతో మోసం చేస్తున్నారు. వారి సంపదను లాగేసుకుని పారిపోతున్నారు. అందువల్ల, కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండటం అవసరం.

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget