జయసుధ నుంచి మీనా వరకు చాలా మంది సీనియర్ హీరోయిన్లు తమ భర్తలను కోల్పోయారు. వాళ్ళెవరో తెలుసుకోండి. మీనా భర్త విద్యాసాగర్ ఈ ఏడాది జూన్ నెలాఖరున మరణించారు. జయసుధ భర్త నితిన్ కపూర్ 2017 మార్చి 14న మరణించారు. కన్నడ హీరో, సుమలత భర్త 2018 నవంబర్ 24న మరణించారు. ఆదర్శ్ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న భానుప్రియ 1998లో విడాకులు తీసుకున్నారు. 2018లో ఆయన మరణించారు. శ్రీహరి మరణంతో డిస్కో శాంతి ఒంటరి అయ్యారు. తెలుగులో పలు చిత్రాల్లో తల్లి పాత్రలు చేస్తున్న రోహిణి... రఘువరన్ భార్య. నటి సురేఖా వాణి సైతం కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. నటి కవిత భర్త కరోనా కాలంలో మరణించారు.