అన్వేషించండి

Ageing: మనమంతా రెండు సార్లు ముసలి వాళ్లమైపోతామట, మొదటి వృద్ధాప్యం వచ్చేది అప్పుడే

What is Ageing: లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ రెండు సార్లు వృద్ధాప్యం వస్తోందని ఇటీవల ఓ అధ్యయనం షాకింగ్ విషయం వెల్లడించింది. కొందరిపై పరిశోధన చేసి రిపోర్ట్ విడుదల చేసింది.

Signs of Ageing: "వాడేంటో అప్పుడే బట్టతల వచ్చేసింది. ఇంత తొందరగా ముసలాడు అయిపోయాడు" అని కామెంట్స్ చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా బాడీషేమింగ్ చేస్తారు. రియాల్టీ ఏంటంటే ప్రతి ఒక్కరూ లైఫ్‌లో ముసలోళ్లు అవుతారు. కానీ...అందరికీ ఈ వృద్ధాప్యం రెండు సార్లు వస్తుందట. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్‌లో ఇదే విషయం వెల్లడైంది. సాధారణంగా రిటైర్ అయ్యే ఏజ్ వస్తే అప్పుడు ముసలితనం వచ్చేసినట్టు భావిస్తుంటాం. కానీ...అంత కన్నా ముందు నుంచే మన శరీరంలోని కణాల్లో శక్తి తగ్గిపోతుంది.  Nature Ageing జర్నల్‌ ఈ నిజాన్ని తేల్చి చెప్పింది. వేలాది మందిపై పరిశోధనలు చేసి మరీ ఈ రిపోర్ట్‌ విడుదల చేసింది.

25-75 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ల శరీరాల్లోని కణాల పని తీరుని ట్రాక్ చేశారు. ఆ క్రమంలోనే చాలా మందిలో 44 ఏళ్ల నుంచే కణాల్లో వృద్ధాప్య ఛాయలు కనిపించడం మొదలైంది. 60 ఏళ్లకు పూర్తి స్థాయిలో వృద్ధాప్యం వచ్చేసిందని గుర్తించారు. అంటే దాదాపు రెండు సార్లు ముసలితనం వచ్చేసినట్టే లెక్క. ఇలా శరీరంలోని కణాల్లో శక్తి మెల్లగా తగ్గిపోవడాన్ని linear ageing గా చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 40 ఏళ్లు వచ్చాక మహిళల్లో మెనోపాజ్ ఆగిపోతుంది. అప్పటి నుంచే వాళ్లకు వృద్ధాప్యం వచ్చినట్టు పరిగణిస్తారు. అయితే...పురుషుల్లోనూ 40 ఏళ్లు దాటాక ఇదే పరిస్థితి వస్తున్నట్టు ఈ పరిశోధన వెల్లడించింది. 

44 ఏళ్లకే వృద్ధాప్యం..

44 ఏళ్లకు ఎప్పుడైతే  వృద్ధాప్యం మొదలవుతుందో అప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. మద్యం సేవించే వాళ్లకు ఈ ముప్పు మరింత ఎక్కువ. ఇదే వయసులో మిగతా వ్యాధులు వచ్చేందుకూ ఆస్కారముంటుంది. 40-59 మధ్య వయసున్న వాళ్లలో 40% మందికి హార్ట్‌ అటాక్‌లు వచ్చే అవకాశముందని వివరించింది. 60 ఏళ్లు దాటాక ఈ రిస్క్ 75% వరకూ పెరుగుతుందని తేల్చి చెప్పింది. సరిగ్గా ఇదే వయసులో పార్కిన్‌సన్, అల్జీమర్స్ లాంటి వ్యాధులూ అటాక్ చేసే ప్రమాదముంది. 40 ఏళ్లు దాటగానే కొందరిలో చర్మం ముడతలుబడిపోతుంది. అదే వృద్ధాప్యానికి సంకేతం. ఈ వయసులోనే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. గాయాలైతే అవి మానడానికీ చాలా సమయం పడుతుంది. (Also Read: Happy Independence Day 2024 : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే)

వృద్ధులు పెరిగిపోతున్నారు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..అంతర్జాతీయంగా 40 ఏళ్లకే వృద్ధాప్యం వస్తున్న దాఖలాలు పెరుగుతున్నాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 2019లో 60 ఏళ్లకు వృద్ధాప్యం వచ్చిన వాళ్ల సంఖ్య 100 కోట్లుగా ఉండగా 2030 నాటికి ఇది 140 కోట్లకి, 2050 నాటికి 200 కోట్లకు చేరుకుంటుందని WHO అంచనా వేసింది. ఇలా 40 ఏళ్లకి ముసలితనం వచ్చేయడాన్ని సైంటిఫిక్‌గా suddenly ageing గానూ పిలుస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు తక్కువగా ఉంటే వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుందని మరి కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. 

Also Read: Jackfruit Health Benefits: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే పనసను డైట్లో చేర్చుకోండి

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget