అన్వేషించండి

Reverse aging in Humans: ఉప్పెనలో హీరోయిన్‌ కోరిక నెరవేరే టైం వచ్చింది- ఎలుకలపై ప్రయోగం సూపర్ సక్సెస్‌

రివర్స్ ఏజింగ్ టెక్నాలజీతో ఎప్పటికీ యవ్వనంగా ఉండిపోవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకపై ప్రయోగంతో తేల్చి చెప్పిన బృందం.

ఎలుక ఏజ్ తిరిగొచ్చిందట 

ముసలితనం రాకుండా, ఎప్పటికీ యవ్వనంగా ఉండిపోయే మంత్రమేదైనా ఉంటే బాగుండు అని కొందరు కోరుకుంటారు. కలలు కంటారు. ఈ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా..? తిరిగి యంగ్‌గా మారిపోవటం సాధ్యమేనా..? అన్న ప్రశ్నలకు కచ్చితంగా సాధ్యమే అని సమాధానమిస్తున్నారు మాలెక్యులర్ బయాలజిస్ట్ డేవిడ్ సిన్‌క్లెయిర్. "వయసైపోతోంది అని ఇకపై బాధ పడాల్సిన పని లేదు. ఏజ్ రివర్సింగ్‌తో వయసుని తిరిగి పొందొచ్చు" అని అంటున్నారు . హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని ల్యాబ్‌లో ఓ ఎలుకపై ప్రయోగం చేసి ఈ విషయం తేల్చి చెప్పారు. వయసైపోయిన ఓ ఎలుకను తీసుకొచ్చి అది మళ్లీ యంగ్‌గా మారేలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

రివర్స్ ఏజింగ్‌ ఇలా చేస్తారు

అడల్ట్ సెల్స్‌ని స్టెమ్ సెల్స్‌గా మార్చే సాంకేతికతతో, ప్రోటీన్ల సాయంతో ఎలుకలోని ఏజింగ్ సెల్స్‌ని రీసెట్ చేసింది సిన్‌క్లెయిర్ బృందం. ఈ ప్రయోగంపై 2020లోనే రిపోర్ట్ విడుదల చేశారు. కంటి చూపు మందగించి, రెటీనా దెబ్బ తిన్న ఎలుక ఇప్పుడు మళ్లీ స్పష్టంగా చూడగలుగుతోందని వెల్లడించారు. ఈ ఎలుక శాశ్వతంగా యవ్వన దశలోనే ఉంటుందని చెబుతున్నారు సిన్‌క్లెయిర్. దాదాపు రెండు దశాబ్దాలుగా రివర్స్ ఏజింగ్‌ సాంకేతికతపై డేవిడ్ సిన్‌క్లెయిర్ పరిశోధనలు చేస్తున్నారు. రివర్స్ ఏజింగ్‌ విజయవంతమైతే మనకొచ్చిన జబ్బులన్నీ నయమైపోయి ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశముంటుందట. వందేళ్ల లోపు వచ్చే రోగాలన్నింటినీ అధిగమించవచ్చట. ఈ రివర్స్ ఏజింగ్ టెక్నాలజీ లక్ష్యం కూడా జబ్బులను నయం చేయటమే అన్నది సిన్‌క్లెయిర్ అభిప్రాయం.  ఏజింగ్ సెల్స్‌ని రీసెట్ చేసిన వెంటనే ఎలుక జ్ఞాపకశక్తి పెరిగిందని, మెదడులోనూ మార్పులు వచ్చాయని చెప్పింది శాస్త్రవేత్తల బృందం. ఎలాంటి హాని కలిగించని వైరస్‌ని జన్యువుల్లోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా ఎలుకకు కంటి చూపు తిరిగొచ్చిందని చెప్పారు సిన్‌క్లెయిర్. మనుషుల్లోనూ ఇదే తరహా టెక్నాలజీ వినియోగించి తిరిగి యవ్వనంగా మార్చవచ్చని చాలా ధీమాగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

మన శరీరంలో బ్యాకప్ కాపీ, అంటే ఏంటి..?

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన ఫైల్స్‌ ఉంటే వాటిని బ్యాకప్ చేసుకుంటాం. తరవాత అవసరమైనప్పుడు తీసుకుని వినియోగిస్తాం. మన శరీరంలోనూ యవ్వనానికి సంబంధించిన సమాచారమంతా సెల్స్ రూపంలో నిక్షిప్తమై ఉంటుందట. దీన్నే సైంటిఫిక్ భాషలో "బ్యాకప్ కాపీ" అని పిలుస్తారు. రివర్స్ ఏజింగ్‌ సాంకేతికతతో ఈ బ్యాకప్ కాపీని తిరిగి వినియోగించుకునేందుకు వీలవుతుంది. తద్వారా మళ్లీ యవ్వనంగా మారిపోవచ్చన్నమాట. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అద్భుతం జరగటానికి ఇంకెంతో సమయం పట్టదని అంటున్నారు. ఈ టెక్నాలజీ ఏదో కాస్త త్వరగా రావాలని కోరుకుందాం మరి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Mahesh Babu: సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
సెంటిమెంట్ పక్కన పెట్టిన మహేష్ బాబు... SSMB29 ప్రారంభోత్సవానికి హాజరు
Bapatal District Crime News : తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
తలపై కాలు పెట్టి మెడకు ఉరి వేసి హత్య, భర్తలకు వార్నింగ్ ఇచ్చిన మహిళ- బాపట్ల జిల్లా దారుణం 
Tirumala: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
Gill Get Summons by CID: శుభమాన్ గిల్‌కు సీఐడీ సమన్లు, రూ.450 కోట్ల స్కామ్‌లో విచారించనున్న అధికారులు, మరో ముగ్గురు క్రికెటర్లుకు నోటీసులు
శుభమాన్ గిల్‌కు సీఐడీ సమన్లు, రూ.450 కోట్ల స్కామ్‌లో విచారించనున్న అధికారులు, మరో ముగ్గురు క్రికెటర్లుకు నోటీసులు
Amaravati Works News: అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడవు
Maha Kumbh 2025 : మహా కుంభమేళా 2025కు వెళ్లే 22 రైళ్ల జాబితా రిలీజ్ - పెరగనున్న కోచ్‌లు
మహా కుంభమేళా 2025కు వెళ్లే 22 రైళ్ల జాబితా రిలీజ్ - పెరగనున్న కోచ్‌లు
Embed widget