Anant Ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు ముఖేశ్ అంబానీ కాస్ట్‌లీ రిటర్న్ గిఫ్ట్స్ - ఇంతకీ ఏం ఇచ్చారంటే?
Anant Ambani Wedding: అనంత్, రాధిక మర్చంట్ పెళ్లికి అతిథులుగా వస్తున్న వారందరికీ అన్ని సౌకర్యాలను అందించింది అంబానీ ఫ్యామిలీ. అదే సమయంలో వారి ఉద్యోగులకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి హ్యాపీ చేసింది.
Anant Ambani - Radhika Merchant Wedding: ఫైనల్‌గా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు చివరిదశకు చేరుకున్నాయి. ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్, సంగీత్ అంతా ముగించుకొని అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫైనల్‌గా పెళ్లి పీటలెక్కారు. పెళ్లి కోసం ప్రైవేట్ జెట్స్, ట్రాఫిక్ ఆంక్షలు, ముంబాయ్ అంతా హడావిడి అంటూ నెటిజన్లు.. దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లి కావడంతో వారి కంపెనీల్లోని ఉద్యోగులు అందరికీ స్పెషల్ గిఫ్ట్స్‌ను అందించారు. చాలామంది రిలయన్స్ ఉద్యోగులు.. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా తమకు అందిన రిటర్న్ గిఫ్ట్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Thankyou @reliancejio for the sweets
— The codewali (@the_codewala) July 10, 2024
We wish best for the Anant Ambani’s wedding. pic.twitter.com/GYdk7BiJQN
ఇట్లు నీతా, ముఖేశ్ అంబానీ..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లికి హాజరయిన ప్రతీ గెస్ట్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ముఖేశ్ అంబానీ. ఇదే సమయంలో తమ ఉద్యోగులను పక్కన పెట్టకూడదు అనే ఉద్దేశ్యంతో వారికి కూడా రిటర్న్ గిఫ్ట్స్‌ను అందించారు. రిలయన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్వీట్ ప్యాకెట్స్‌తో పాటు సిల్వర్ కాయిన్‌ను బహుమతిగా ఇచ్చారు ముఖేశ్ అంబానీ. వారికి అందిన రిటర్న్ గిఫ్ట్స్‌లో నాలుగు ప్యాకెట్స్ హల్దీరామ్ నమ్కీన్, స్వీట్స్‌తో పాటు సిల్వర్ కాయిన్ ఉండడం విశేషం. ‘‘దేవుళ్ల సాక్షిగా అనంత్, రాధికల పెళ్లి జరుగుతోంది. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇట్లు నీతా, ముఖేశ్ అంబానీ’’ అంటూ రిటర్న్ గిఫ్ట్స్‌కు ఒక నోట్‌ను కూడా యాడ్ చేశారు.
On the occasion of Anant Ambani's wedding, they has distributed sweets in all the Reliance owned companies.#AmbaniWedding #Jio pic.twitter.com/cTPQg4KR1f
— Parashar (@arparashara) July 9, 2024
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..
ముంబాయ్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కారణంగా గత వారం రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ ఆంక్షల గురించి వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ఉద్యోగులకు జులై 15 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించారు. శుక్రవారం పెళ్లి వేడుకలు పూర్తయినా కూడా దాని తర్వాత రెండు గ్రాండ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ. దీంతో జులై 15 వరకు ముంబాయ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు తప్పవని తెలుస్తోంది. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కోసం ఎంతోమంది రాజకీయ, సినీ సెలబ్రిటీలు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వివాహం చూడడానికి ముంబాయ్‌కు ప్రయాణమయ్యారు. వారితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ పెళ్లికి హాజరవ్వనున్నారు.
Also Read: అది పెళ్లి కాదు, ఓ సర్కస్ - అనంత్ అంబానీ పెళ్లి వేడుకలపై బాలీవుడ్ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్