అన్వేషించండి

Anant Ambani Wedding: అది పెళ్లి కాదు, ఓ సర్కస్ - అనంత్ అంబానీ పెళ్లి వేడుకలపై బాలీవుడ్ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Aaliyah Kashyap Refused To Attend Anant Ambani-Radhika Merchant's Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ బాష్, సంగీత్ వేడుకలు, హల్దీ సెరిమనీ అట్టహాసంగా జరిగింది. రేపు(జులై 12న) రాధిక మెడలో అనంత్ మూడు ముళ్లు వేయనున్నారు. ఈ పెళ్లికి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

అనంత్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పలువురు సినీ తారలు

ఇప్పటికే అనంత్, రాధికా పెళ్లి వేడుకలకు పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసాంజ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ సహా పలువురు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

అంబానీ పెళ్లిపై ఆలియా షాకింగ్ కామెంట్స్

అటు అంబానీ పెళ్లి వేడుకలపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అది పెళ్లిలా కాదు, సర్కస్ లా ఉందంటూ విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. "అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. ఓ సర్కస్‌లా ఉంది. అయినప్పటికీ, నేను ఆ సర్కస్ ను ఫాలో అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించారు. కానీ, డబ్బు కోసం పెళ్లికి వెళ్లాలి అనుకోలేదు. నన్ను నేను అమ్ముకోకూడదు అని భావించాను. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని నమ్ముతాను. అందుకే, అంబానీ పెళ్లికి వెళ్లేందుకు నో చెప్పాను” అని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.   

మేలో బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం

అటు ఆలియా త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. మేలో తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో నిశ్చితార్థం జరుపుకుంది. ఇండోనేషియాలోని బాలి వేదికగా ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. ఆలియా తల్లి ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ ఆర్తీ బజాజ్. 1997లో ఆమె అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలం పాటు వీరి సంసారం జీవితం సాఫీగా కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2009లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

జులై 12న అట్టహాసంగా అంబానీ వెడ్డింగ్

జులై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ఘనంగా జరగనుంది. మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. 12న పెళ్లి జరగనుండగా, 13 శుభ్ ఆశీర్వాద్ వేడుకలు జరుగుతాయి. 13న పెళ్లి రిసెప్షన్ జరగనుంది.  

Also Read: చెల్లి పెళ్లిలో అక్క సందడి - రాధిక సోదరి అంజలీ మర్చంట్‌ లెహంగాపై చర్చ, ధర తెలిస్తే షాకవుతారేమో!

టాప్ హెడ్ లైన్స్

Yash Alibaug Property: షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget