అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎంతో మంది అతిథులు హాజరయ్యారు. హైపర్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే ఈ వేడుకలకు హాజరయ్యారు. రెడ్ డ్రస్సులో రాణి ముఖర్జీ మెరిశారు. డైరెక్టర్ అట్లీ, తన భార్య ప్రియతో వేడుకలకు వచ్చారు. సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీతో సహా వచ్చారు. అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ఈ వేడుకలకు వచ్చారు. షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా ఈ వేడుకలకు వచ్చారు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ సిస్టర్స్ ఈ వేడుకల్లో కనిపించారు. ధర్మేంద్ర, కిరణ్ రావు కూడా వేడుకల్లో మెరిశారు.