Seasonal Migraine: శీతాకాలంలో మైగ్రేన్ - ఉపశమనం కోసం ఈ టిప్స్ పాటించండి
Seasonal Migraine: మైగ్రేన్ చాలా తీవ్రమైన సమస్య. తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. చలికాలంలో వేధించే మైగ్రెన్‌కు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.
Seasonal Migraine: వాతావరణంలో మార్పులు అనేక రోగాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఎన్నో వైరస్‌లు ఉనికిలో ఉంటాయి. అవి మైగ్రేన్ పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. వాతావరణంలో మార్పుల వల్ల మైగ్రేన్ సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు, ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. సున్నితంగా ఉండే వ్యక్తులు చలికాలంలో ఎక్కువగా మైగ్రేన్‌కు గురవుతుంటారు. కాలానుగుణ మైగ్రేన్లు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తీవ్రమైన తలనొప్పితో ఏ పనులు చేయలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఈ చిట్కాలతో కాస్త ఉపశమనం పొందవచ్చు.
సీజనల్ మైగ్రేన్‌లకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే:
హైడ్రేటెడ్ గా ఉండండి:
చలికాలంలో చాలా మంది తక్కువ నీళ్లు తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపించరు. దీని కారణంగా శరీరంలో డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ అనేది మైగ్రేన్ రావడానికి ముఖ్యకారణమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన నిద్ర:
చాలామందికి రాత్రిళ్లు మెలుకువ ఉండే అలవాటు ఉంటుంది. రాత్రిళ్లు మొబైల్స్ చూడటం, పీసీల ముందు కూర్చోవడం.. శరీరానికి సరిపడా నిద్ర అందించకపోవడం కూడా మైగ్రేన్ సమస్యకు ఒక కారణమని చెబుతున్నారు. 7-9 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోండి:
కాలానుగుణ మార్పులు తరచుగా ఒత్తిడిని పెంచుతాయి. మీ దినచర్యలో యోగా లేదా ధ్యానం వంటివి చేర్చుకోండి. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి.
ప్రశాంతంగా ఉండండి:
బ్లాక్‌అవుట్ కర్టెన్‌లతో లైట్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గట్టిగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడండి. సువాసనతో సౌకర్యవంతమైన ఫూమ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇది కాలానుగుణ మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుంది.
మందులు:
మైగ్రేన్ సమస్యకు ఎలాంటి మందులు వాడాలో తెలుసుకునేందుకు డాక్టర్‌ను సంప్రదించండి. మైగ్రేన్‌ల తీవ్రతను పరిష్కరించడానికి నివారణ లేదా తీవ్రమైన చికిత్సను సూచించవచ్చు.
వాతావరణ మార్పుల గురించి తెలుసుకోండి:
వాతావరణం మైగ్రేన్‌లను ప్రేరేపిస్తుంది. సంభావ్య ట్రిగ్గర్‌లను అంచనా వేయడానికి.. వాటి కోసం సిద్ధంగా ఉండేందుకు వాతావరణం గురించి నిరంతరం తెలుసుకోండి. మార్పులకు అనుగుణంగా మీ దినచర్య ఉండేలా ప్లాన్ చేసుకోండి.
మైగ్రేన్ ఎలా నివారించాలి?
చలికాలంలో తలనొప్పి ముఖ్యంగా మైగ్రేన్ రాకుండా ఉండాలంటే చలికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది సెరోటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మైగ్రేన్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. చల్లని వాతావరణంలో బయటకు వెళ్లేటప్పుడు మీ తలను కవర్ అయ్యేలా చూసుకోండి. దీంతో మైగ్రేన్లను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : చలికాలంలో సన్షైన్ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.