News
News
X

Tomato Stew: జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఇలా టమాటో సూప్ చేసుకోండి

టమాటో స్ట్యూ లేదా టమాటో సూప్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

FOLLOW US: 
Share:

టమాటోలలో పోషకాలు అధికం వీటిని తినడం వల్ల శరీరానికి అన్ని విధాలా మంచిది.  టమాటో సూప్‌ను అప్పుడప్పుడు చేసుకుని తింటే ఎంతో మంచిది. వైరల్ ఫీవర్లు వస్తున్న కాలంలో టమాటో సూప్ తాగడం చాలా ముఖ్యం. జలుబు, దగ్గు కూడా ఈ సూప్ వల్ల తగ్గుతుంది.  ఇది కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. చేయడం కూడా చాలా సులువు. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. 

కావాల్సిన పదార్థాలు
టమోటా - పావు కిలో
బిర్యానీ ఆకు - ఒకటి
అల్లం తరుగు - అరస్పూను
పచ్చిమిర్చి - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
నూనె - ఒక స్పూను
కొత్తి మీర తరుగు - ఒక స్పూను

తయారీ ఇలా
1. టమోటోలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. స్టవ్ పై కళాయి పెట్టి టమోటో ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గించాలి. 
3. కళాయితే మూత పెడితే టమాటోలు బాగా మగ్గుతాయి. 
4. తరువాత మూత తీసి గరం మసాలా కూడా వేయాలి. 
5. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 20 నిమిషాల పాటూ ఉడికించాలి. 
6. మరొక కళాయిలో అరస్పూను వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. 
7. ఆ మిశ్రమాన్ని టమాటో గుజ్జులో వేయాలి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి. 

ఆరోగ్యానికి....
టమోటోలలో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ టమోటో సూప్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తిన్నా మంచిదే. ఈ సూప్‌‌ను తరచూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్ తో పోరాడే శక్తి శరీరానికి ఇస్తుంది. టోమాటోలు, మసాలా దినుసులతో రూపొందించే ఈ సూప్ గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. మధుమేహం ఉన్న వారికి ఈ సూప్ మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు, మెదడు వ్యాధులు ఉన్న వారు టమోటో సూప్ తరచూ తాగితే ఎంతో మేలు. మహిళలు కచ్చితంగా ఈ సూప్ తాగాలి. ఎముకలు బలహీనంగా మారడం తగ్గుతుంది. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లైకోపీన్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.  ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.

Also read: మహిళలూ ప్రతిరోజూ మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలు ఇవే

Also read: ప్రతి భారతీయ మహిళా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, చట్టాల జాబితా ఇదిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 07 Mar 2023 02:52 PM (IST) Tags: Tomato Recipes Tomato Stew Tomato Soup Recipe

సంబంధిత కథనాలు

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Dosa Recipe: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Dosa Recipe: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Paneer Curry: చపాతీలోకి అదిరిపోయేలా పనీర్ మేథి కూర

Paneer Curry: చపాతీలోకి అదిరిపోయేలా పనీర్ మేథి కూర

Biryani ATM: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!

Biryani ATM: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!

Mutton Curry: బ్లాక్ మటన్ కర్రీ, ఒక్కసారి టేస్టు చేసి చూడండి

Mutton Curry: బ్లాక్ మటన్ కర్రీ, ఒక్కసారి టేస్టు చేసి చూడండి

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!