అన్వేషించండి

Toddler Food Recipe : పిల్లలు హెల్తీగా బరువు పెరిగేందుకు రాగులను ఇలా చేసి తినిపించండి

Healthy Food : పిల్లలకి మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలి. అప్పుడే వారి ఎదుగుదల మంచిగా ఉంటుంది. పిల్లలకు అందించాల్సిన ఓ చక్కటి హెల్తీ రెసిపీ ఇక్కడుంది.

Ragi Porridge for Babies : పిల్లలు ఆహారం విషయంలో.. ముఖ్యంగా 6 నుంచి 8 నెలలున్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది వారి ఎదుగుదలను నిర్ణయిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. అందుకే కొన్ని రకాల ఆహారాలను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాగులతో చేసుకునే ఓ రెసిపీని కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రాగులతో చేసుకోగలిగే ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం కానీ.. దానికి ముందు ప్రాసెస్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అయితే ఆ సమయంలో కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ దీనిని తయారు చేసుకోవడం వర్త్ వర్మ వర్త్ అనిపించే రెసిపీ ఇది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

రాగులు - 1 కేజీ

నీళ్లు - తగినంత

తయారీ విధానం

రాగుల్లో చిన్న రాళ్లు, గడ్డి లేకుండా శుభ్రంగా ఏరుకోవాలి. అనంతరం వాటిని శుభ్రమైన నీటితో క్లీన్ చేయాలి. ఎక్కువసార్లు కడిగితే చాలా మంచిది. ఎందుకంటే రాగులు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని మీరు ఎంత క్లీన్ చేస్తే వాటిలోని డస్ట్ అంత బయటకు పోతుంది. ఇలా కడిగిన రాగుల్లో నీళ్లు వేసి 24 గంటలు నానబెట్టండి. రాగులు నానబెట్టిన గిన్నెపై మూత వేయకుండా.. కాటన్ క్లాత్​ను కట్టండి. ఇలా చేయడం వల్ల రాగులు మొలకెత్తినా.. వాసన రాకుండా ఉంటాయి. దీనిని లోపల ఉంచకుండా వరండా లేదా మంచి వెలుతురు వచ్చే ప్రాంతంలో ఉంచండి. ప్రతి 8 గంటలకు నీటిని మార్చాలి.

24 గంటలు గడిచిన తర్వాత వాటిని మరోసారి బాగా కడిగి.. దానిలో నీటిని వంపేయండి. ఇప్పుడు వాటిని శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన కాటన్ క్లాత్​ వేసి.. మూటగట్టండి. మూట గట్టిగా కడితే మంచిది. దీనివల్ల స్ప్రౌట్స్ సులభంగా వస్తాయి. ఇప్పుడు వాటిని ఓ స్టీల్ గిన్నెలో ఉంచి.. మూతతో కొంచెం కవర్ చేసి.. డార్క్​గా ఉండే ప్రదేశంలో మరో 24 గంటలు ఉంచండి. మూటను విప్పితే రాగులు మంచిగా మొలకలు వచ్చి కనిపిస్తాయి. ఇప్పుడు వాటిని డ్రై రోస్ట్ చేయండి. స్టౌవ్ వెలిగించి మీడియం మంట మీద వాటిని డ్రై రోస్ట్ చేస్తే క్రంచీగా వస్తాయి. ఇప్పుడు వాటిని రోస్ట్ చేస్తే మంచి పౌడర్ వస్తుంది. 

ఈ రాగి పిండిని మీరు స్టోర్ చేసి పిల్లల కోసం జావను తయారు చేయవచ్చు. స్టౌవ్ వెలిగించి దానిలో నీటిని పోసి మరిగించాలి. ఇప్పుడు ఓ గిన్నెలో రాగిపిండిని తీసుకోండి. దానిలో కాస్త నీరు వేసి పేస్ట్​లా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేయండి. అది కాస్త దగ్గరయ్యే వరకు తిప్పి.. స్టౌవ్ ఆపేయండి. దానిని చల్లార్చి.. పిల్లలకు తినిపిస్తే మంచిది. ఇలా ఈ రెసిపీతో పిల్లలు మంచి బరువు పెరుగుతారు. అంతేకాకుండా దీనిలోని న్యూట్రిషయన్స్ పిల్లలకు మంచిగా అందుతాయి. దీనిలోని ఫైబర్ వారికి మెరుగైన జీవక్రియను అందిస్తుంది. కాబట్టి మీరు రాగులతో ఈ పిండిని తయారు చేసి పెట్టండి. రాగిపిండితో కూడా దీనిని చేసుకోవచ్చు కదా అనుకుంటే పిల్లల ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. అయితే పిల్లలకు ఈ ఫుడ్ తినిపించే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోండి. 

Also Read : బరువు తగ్గేందుకు కీటో పోహా.. ఇది లోకార్బ్ డైట్​కి బెస్ట్ ఆప్షన్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget