అన్వేషించండి

Low Carb Diet : బరువు తగ్గేందుకు కీటో పోహా.. ఇది లోకార్బ్ డైట్​కి బెస్ట్ ఆప్షన్

Keto Poha Recipe : బరువు తగ్గేందుకు కీటో డైట్​ ఫాలో అవుతున్నారా? అయితే మీరు మీ బ్రేక్​ఫాస్ట్​లో లోకార్బ్ బ్రేక్​ఫాస్ట్​ను తయారు చేసుకోవచ్చు. దాని రెసిపీ ఏమిటంటే..

Healthy Breakfast : హెల్తీ బ్రేక్​ఫాస్ట్​లలో లో కార్బ్​ బ్రేక్​ఫాస్ట్ (Low carb Breakfast) మంచిది. ఇది మీరు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది అలాగే పోషకాలు అందిస్తుంది. బరువు తగ్గేందుకు ట్రై చేస్తుంటే మీరు కీటో పోహాను మీ డైట్​లో చేర్చుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కుగా ఉంటుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్, ఆంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని మీరు కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కాలీ ఫ్లవర్ - 200 గ్రాములు

ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - చిటికెడు

కరివేపాకు - 1 రెబ్బ

ఉల్లిపాయ - 1

ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

పల్లీలు - గుప్పెడు

పచ్చిమిర్చి - 2

అటుకులు - 200 గ్రాములు

నిమ్మరసం - 1 స్పూన్

కొత్తిమీర - గార్నిష్ కోసం

తయారీ విధానం 

ముందుగా కాలీఫ్లవర్​ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే దానిలో పురుగులు ఉండిపోతాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. ఇలా చేస్తే కాలీఫ్లవర్ మెత్తగా అవుతుంది. అంతే కాకుండా దానిలోని మలినాలు పోతాయి. అవి ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా కడిగి.. సన్నగా ముక్కలు చేసుకోవాలి. అటుకులను కడిగి.. నీరు లేకుండా పిండి.. పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. అది వేడి అయ్యాక దానిలో ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె వేగిన తర్వాత దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. కాస్త క్రిస్పీగా వచ్చినప్పుడు ఆవాలు వేసి వేయించాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. ఉప్పు, పసుపు కూడా అప్పుడే వేయిస్తే మంచిది. కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. మరోసారి బాగా కలిపి దానిలో కాలీఫ్లవర్ వేసి మగ్గనివ్వాలి. 

కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. ఓ రెండు నిమిషాలు అలాగే ఉంచి.. స్టౌవ్ ఆపేయండి. దానిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి కీటో పోహా రెడీ. ఇది తక్కువ కార్బ్స్ కలిగిన అల్పాహారం. దీనిలో కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మీరు కీటో డైట్ చేస్తుంటే దీనిని మీరు రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేయడంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

Also Read : స్పాంజ్​లాంటి సెట్​ దోశల కోసం ఈ రెసిపీని ఫాలో అయిపోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget