Eggless Cake Recipe: కొత్త ఏడాదికి ఎగ్‌లెస్ కేకు, ఇంట్లోనే ఇలా చేయండి
కోడిగుడ్డు అవసరం లేకుండా కేకును ఇలా ఇంట్లోనే తయారు చేయవచ్చు.
కొత్త ఏడాది వచ్చిందంటే కేకును కట్ చేసి తినేవారు ఎంతో మంది. అయితే కేకులో కచ్చితంగా వేసేది కోడి గుడ్డు. అది చాలా మందికి నచ్చదు. గుడ్డు అవసరం లేకుండా ఇంట్లోనే మీరు కేకును తయారు చేసుకోవచ్చు. గుడ్లకు బదులు వెజిటబుల్ నూనె, పాలు వంటివి కలపడం ద్వారా శాఖాహార కేకును తయారు చేయచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఇందులో నిండుగా నట్స్ వేస్తాము కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
కావాల్సిన పదార్థాలు
ఖర్జూరాలు - ఒక కప్పు
గోధుమ పిండి - రెండు కప్పులు
పెరుగు - పావు కప్పు
గోరువెచ్చని నీళ్లు - ఒకటిన్నర కప్పు
వెజిటబుల్ నూనె - అర కప్పు
బాదం, పిస్తాలు - అరకప్పు
పంచదార పొడి - రెండు కప్పులు
బేకింగ్ సోడా - అర టీస్పూను
తయారీ ఇలా
1. ఖర్జూరాన్ని లోపల గింజలు తీసి చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు గోరువెచ్చని పాలు పోయాలి.
2. అలా పావుగంట సేపు నాననివ్వాలి. తరువావ మిక్సీలో వేసి మందపాటి పేస్టులా వేయాలి.
3. ఆ పేస్టును ఒక గిన్నెలో వేయాలి. అందులో వెజిటబుల్ నూనె, పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి.
4. గోధుమ పిండిని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఉండల్లేకుండా చూసుకోవాలి.
5. జల్లించిన గోధుమపిండిని కూడా ఆ గిన్నెలో వేయాలి. బేకింగ్ పొడి, బేకింగ్ సోడా వేసి బాగా గిలక్కొట్టాలి.
6.పేస్టు మరీ మందంగా ఉందనుకుంటే అరకప్పు గోరువెచ్చని పాలు వేసి మళ్లీ కలపాలి.
7. అందులో ఖర్జూర ముక్కలు, బాదం, పిస్తా ముక్కలు వేసి కలపాలి.
8. ఇప్పుడు కేకు మౌల్డ్ లో కింద బటర్ రాసి, కాస్త పిండి చల్లాలి. అందులో కేకు మిశ్రమాన్ని వేయాలి. గాలి బుడగలు లేకుండా మౌల్డ్‌ను కింద మెల్లగా తట్టాలి.
9. ముందుగా మైక్రో ఓవెన్‌ను 180 డిగ్రీలు ప్రీ హీట్ చేసుకోవాలి. అందులో కేకు మౌల్డ్ పెట్టాలి.
10. సరిగ్గా 45 నిమిషాల పాటూ ఉంచితే కేకు సిద్ధమవుతుంది.
ఓవెన్ లేకపోతే...
ఓవెన్ లేకపోయినా కూడా కుక్కర్లో కేకును చేసుకోవచ్చు.
1. కుక్కర్ అడుగు భాగంలో మెత్తటి ఇసుక లేదా రాళ్ల ఉప్పు వేయాలి. మూత పెట్టి ప్రీ హీట్ చేసుకుంటే మంచిది.
2. తరువాత మూత తీసి కేకు మౌల్డ్‌ను అందులో పెట్టి, కుక్కర్ మూత పెట్టేయాలి.
3. దాదాపు నలభై నిమిషాల పాటూ చిన్న మంట మీద ఉడికించాలి.
4. ఒక సన్నని టూత్ పిక్ తో గుచ్చితే, దానికి ఏమీ అతుక్కోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే.
5. ఇప్పుడు కేకు చల్లారాక తీసి ఒక ప్లేటులో వేయాలి. అంతే కేకు రెడీ అయినట్టే. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మీరే వండుతారు.
Also read: అప్పటికప్పుడు చేసుకుని తినేలా కంది పప్పు దోశలు -రుచి అదిరిపోతుంది