News
News
X

Kheer Recipes: పండుగలు ఏవైనా సరే, ఈ నాలుగు రకాల పాయసాలతో నోరు తీపి చేసుకోండి

పండుగ అంటే గుర్తొచ్చేది పాయసం. ఎందుకంటే నైవేద్యంగా ఎక్కువమంది ఆ దేవునికి సమర్పించేది పాయసాన్నే.

FOLLOW US: 
Share:

తెలుగింటిలో పండుగ వచ్చిందంటే చాలు.. తీపి పదార్థాలు వంటింట్లో రెడీ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పాయసం ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. పాయసం అనగానే అందరూ సేమ్యాతో వండేదే అనుకుంటారు. కానీ సేమ్యాతోనే కాదు నాలుగు రకాలుగా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని వండడం కూడా చాలా సులువు.

బియ్యం పాయసం 
దేవునికి సమర్పించేందుకు పరమాన్నాన్ని మించిన పవిత్ర నైవేద్యం లేదు. దీన్నే కాస్త మందంగా కాకుండా నీళ్లలా చేసుకుంటే టేస్టీ బియ్యం పాయసం రెడీ అయిపోతుంది.

ఈ పాయసం చేసేందుకు ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్, నట్స్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఒకటిన్నర లీటర్ పాలను వేసి వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యాన్ని, చక్కెరను, యాలకుల పొడిని జోడించాలి. చిన్న మంట మీద ఉడికిస్తే పాయసం చక్కగా తయారవుతుంది. చివర్లో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ చల్లు కోవాలి.

డ్రై ఫ్రూట్స్ పాయసం
స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి, ఆ నెయ్యిలో  పావుకప్పు బాదం పప్పులు, పావుకప్పు జీడిపప్పులు, నాలుగైదు ఎండు ద్రాక్షలు, అరకప్పు అంజీరు వేసి వేయించాలి. వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక లీటరు పాలు వేసి మరిగించాలి. ఆ పాలలో క్రీం కూడా వేయాలి. తర్వాత అరకప్పు పంచదార వేసి కలపాలి. చిన్న మంట మీద మరిగిస్తే బాగా ఉడుకుతాయి.  పాలు సగం వరకు తగ్గేదాకా మరిగిస్తూ ఉండాలి. తర్వాత ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని, యాలకుపొడిని వేసి మళ్లీ ఉడికించాలి. ఒక పావుగంటసేపు ఉడికిస్తే డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోతుంది.

సగ్గుబియ్యం పాయసం
ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని గంట పాటు నీటిలో నానబెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ కళాయిలో ఒకటిన్నర పాలను వేసి మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడే యాలకుల పొడి, అరకప్పు పంచదార, నాలుగు కుంకుమపువ్వు రేకులు వేసి మరిగించాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పాలల్లో వేయాలి. చిన్న మంట మీద ఉడికించాలి. 20 నిమిషాలు ఉడికితే సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయి. మూడు టేబుల్ స్పూన్ల కండెన్స్‌డ్ మిల్క్ కూడా వేసి, మరి కాసేపు మరిగిస్తే ఘుమఘుమలాడిపోతుంది.

మఖానా కీర్
మార్కెట్లో దొరికే పూల్ మఖానాతో చక్కటి పాయసాలు చేసుకోవచ్చు. ఒక కప్పు పూల్ మఖానాను అరకప్పు నట్స్ తో కలిపి మిక్సీలో పొడి కొట్టుకోవాలి. నట్స్‌లో భాగంగా జీడిపప్పు, పిస్తా, బాదం ఇలా మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక లీటరు పాలు, ఒక కప్పు క్రీము, అరకప్పు పంచదార, రెండు మూడు కుంకుమపువ్వు రేకులు వేసి ఉడికించాలి. పాలు బాగా మరిగి పరిమాణం తగ్గడం మొదలవుతాయి. ఆ సమయంలో ముందుగా చేసి పెట్టుకున్న మఖానా పొడిని వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద ఒక పావుగంట సేపు ఉడికిస్తే మఖానా పాయసం నైవేద్యానికి సిద్ధమైనట్టే. 

Also read: మనిషి మాంసం తినే ఈ బ్యాక్టీరియాతో జాగ్రత్త, వీటి వల్ల ప్రాణానికే ముప్పు

Published at : 18 Feb 2023 12:41 PM (IST) Tags: Telugu Vantalu Recipes Kheer Recipes in Telugu Sweet Recipes in Telugu

సంబంధిత కథనాలు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం