![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakhi Wishes 2024 : మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండిలా
Happy Raksha Bandhan : రాఖీ సమయంలో వివిధ కారణాల వల్ల కొందరు రక్షాబంధన్ కట్టించుకోలేరు. అలా మీ బ్రదర్ లేదా సిస్టర్ దూరంగా ఉంటే సోషల్ మీడియాలో వారికి ఈ హార్ట్ టచ్చింగ్ మెసేజ్‌లు పంపొచ్చు.
![Rakhi Wishes 2024 : మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండిలా RakshaBandhan 2024 Rakhi wishes you could share with your long distance brother or sister through WhatsApp and Facebook and Instagram Rakhi Wishes 2024 : మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పేయండిలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/c3a353c307bc3da510a2febe52ca64251724031731700874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RakshaBandhan Wishes 2024 : బ్రదర్, సిస్టర్ మధ్య సంబంధానికి గుర్తుగా.. నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పే రక్షణకు గుర్తుగా ఏటా రాఖీ పండుగ(Rakhi Pournami 2024)ను జరుపుకుంటారు. దీనినే రక్షాబంధన్ అని కూడా అంటారు. ఇది అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడి మధ్య ఉండే విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది. ఇది ఒక్కో సంవత్సరం ఒక్కో రోజున వస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 19, 2024న ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో మీ అన్నా లేదా తమ్ముడికి దూరంగా ఉంటే.. వారికి రాఖీ కట్టలేకపోతే ఈ సందేశాన్ని వారికి పంపండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఈ విషెష్ చెప్పేయండి.
రక్షాబంధన్ 2024 శుభాకాంక్షలు
- ప్రపంచంలోనే బెస్ట్ బ్రదర్‌కి రక్షా బంధన్ శుభాకాంక్షలు. నువ్వే నా బలం, నువ్వే నా మార్గదర్శకుడివి. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌వి.
- ఈ రాఖీ పండుగ సందర్భంగా.. నీకు మునుపెన్నడు లేని ఆనందం, విజయం, ఆరోగ్యం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ రక్షా బంధన్ అన్నయ్య.
- చిన్నప్పుడు నువ్వు నేను ఎంతగా కొట్టుకున్నా.. సంవత్సరాలు గడిచేకొద్ది మన మధ్య ప్రేమ మరింత బలపడుతూనే ఉంది. దీనినే బ్రదర్, సిస్టర్ రిలేషన్ అంటారేమో. మనం ఎప్పుడూ ఇలా కొట్టుకున్నా.. మన మధ్య ప్రేమ మళ్లీ పెరుగుతూనే ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
- ఈ సంవత్సరం నీకు నేరుగా రాఖీ కట్టలేకపోతున్నాను. కానీ ప్రేమతో నీకు అదే రాఖి పంపుతున్నాను. ఇది నేను నీకు పంపే నా ప్రేమగా గుర్తుండాలి. నువ్వు నా రక్షణగా తోడు ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
- నువ్వు చిన్నప్పటి నుంచి నా సూపర్ హీరో అన్నయ్య. అన్నివేళల నాకు తోడుగా ఉండేనీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నా లైఫ్‌లో నువ్వే బెస్ట్ బ్రదర్.
- ప్రపంచంలోనే అత్యంత అందమైన నా చిన్నారి చెల్లెమ్మకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు నీకు దూరంగా ఉన్నా.. నా ప్రేమ నీపై ఇంచుకూడా తగ్గదు.
- అమ్మాయిలతో మాట్లాడని ఇంట్రోవర్ట్‌ని అయినా.. వారితో ఎలా మెలగాలో నేర్పింది మాత్రం నువ్వే నా బంగారు తల్లి. నువ్వు నా లైఫ్‌లో లక్వి రా. హ్యాపీ రక్షాబంధన్ సిస్టర్.
- నువ్వుంటే ఎంత ఇష్టమో చెప్పడానికి నాకు రాఖీ పండుగ అవసరం లేదు. కనీసం ఓ రోజైనా నీకు నా ప్రేమను డైరక్ట్‌గా చెప్పగలుగుతున్నాను చిన్ని తల్లి. హ్యాపీ రక్షాబంధన్ రా.
- అమ్మ లేని లోటుని నువ్వు ఎప్పుడు భర్తి చేశావో తెలీదు. ఇప్పుడు నువ్వు నాకు అక్కవి కాదు.. మరో అమ్మవి. హ్యాపీ రక్షా బంధన్ అక్క.
- నీ మ్యారేజ్ లైఫ్‌లో నువ్వు మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ కచ్చితంగా నీతో రాఖీ కట్టించుకుంటాను సిస్టర్. ఇదే నా ప్రామిస్. రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు.
- నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమైనా ఉంటే నాకు నిర్మోహమాటంగా చెప్పు. వాటిని నేను తీరుస్తాను. నీ రక్షగా నేను నిలబడతాను. నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరైనా సరే.. నీకు అండగా నేను ఉంటాను. ఈ అన్న ఉన్నాడని ఏ సందర్భంలోనూ మరచిపోకు. హ్యాపీ రక్షాబంధన్ సిస్టర్.
ఈ విషెష్‌ను మీ బ్రదర్, సిస్టర్‌కి పంపేయండి. వీటిని సోషల్ మీడియాలో పంపి.. మీ ప్రేమను వారికి తెలియజేయాలని కోరుతూ హ్యాపీ రక్షాబంధన్.
Also Read : అమ్మాయిలు బయటకు వెళ్లేప్పుడు ఈ వస్తువులు తప్పక తీసుకెళ్లండి.. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉండాలి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)