అన్వేషించండి

Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

ఆ దీవి చూడటానికి ఎంత బావుంటుందో, అందులోని మట్టి తింటే మరీ బావుంటుంది.

సప్తవర్ణాల దీవి... ఆ దీవిలో కనిపించని రంగు లేదు. చూసేందుకు బావుంటుందనుకుంటే పొరపాటే, ఆ మట్టి తీసి నోట్లో వేసుకుంటే మరీ రుచి. నమ్మశక్యంగా లేదా?  కానీ ఇది నిజం. ఈ దీవి పేరు హెర్ముజ్ ఐలాండ్. సప్తవర్ణాల్లో ఉంటుంది కాబట్టి ‘రెయిన్ బో ఐలాండ్’ అని కూడా పిలుస్తారు. ఆ దీవిని కాస్త దూరం నుంచి చూస్తే రంగురంగుల్లో తెరలుతెరలుగా కనిపిస్తుంది. ఆ దీవిలో నివసించే ఎంతో మంది ఆ రంగుల మట్టే జీవనాధారం. 

ఎక్కడుంది?
ఇరాన్ దేశానికి 8 కి.మీ దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో ఉంటుంది ఈ దీవి. దాదాపు 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ దీవి. ఇదెంత ప్రత్యేకమంటే దాదాపు 70కి పైగా ఖనిజాలు కేవలం ఈ ఒక్క దీవిలోనే గుర్తించారు పరిశోధకులు. ఎన్ని కోట్ల ఏళ్ల క్రితమే అగ్నిపర్వతాల నుంచి వచ్చిన అవక్షేపాలన్నీ కలిపి ఇలా రంగురంగులుగా మారాయని చెబుతారు శాస్త్రవేత్తలు.ఇది చూసేందుకు చాలా అందంగా, ఆకర్షణీయంగా అంతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎర్రటి బీచులు, ఉప్పు గుహలు, రంగురంగుల గుట్టలతో ఆ దీవిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. 

ఎర్ర మట్టి ఎంతో స్పెషల్
ఇక్కడ దొరికే ఎర్రమట్టికి చాలా ప్రత్యేకమైనది. దీన్ని గెలాక్ అంటారు. స్థానికులు వంటకాల్లో ఈ మట్టిని వాడతారు. ఈ మట్టిని మసాలా ఉపయోగిస్తారు. దీంతో సూరఖ్ అనే సాస్ ని తయారు చేస్తారు. ఆ సాస్‌ని బ్రెడ్ తో తింటారు. ఈ మట్టిని ఇంకా చాలా రకాలు వినియోగిస్తారు. బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా ఈ మట్టిని వాడుతారు. అందుకే అక్కడ ఎంతో మంది జీవనోపాధి ఈ మట్టే. 

అక్కడ సముద్ర తీరంలో వచ్చే అలలు కూడా కూడా ఎర్రరంగు పులుముకుంటాయి. కొండలు కూడా ఎర్రగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న గుహను చూస్తే పదేపదే చూడాలనిస్తుంది. ఇంద్రధనుస్సు రంగుల్లో చారల్లా ఉంటుంది. ఇక్కడ దొరికే రాళ్లు కూడా రంగురంగుల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు రాళ్లు, మట్టి,ఉప్పు పెళ్లలు అన్నీ ఏరుకుని తీసుకువెళతారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by World Landforms (@geomorphological_landscapes)

Also read: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Also read: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

టాప్ హెడ్ లైన్స్

Wall Cleaning Tips: గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget