లక్కున్నోడు - 34 ఏళ్లుగా భార్య వద్దన్నా వినలేదు, ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఆమెకు షాకిచ్చాడు!

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దని అతడి భార్య మంచి కోసమే చెప్పింది. కానీ, అతడు మాట వినలేదు. చివరికి కుంభ స్థలాన్ని బద్దలకొట్టాడు.

FOLLOW US: 

బ్బులుంటే దాచుకోవాలే గానీ, అనవసర ఖర్చులు, జూదాలకు ఎందుకు వేస్ట్ చేయడమనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అతడి భార్య కూడా అదే ఉద్దేశంతో భర్తను వారించేది. వద్దు వద్దంటూ ఎన్నోసార్లు అడ్డుకున్నా.. ఆ భర్త ఆమె మాట వినేవాడు కాదు. ఒకటి కాదు రెండు కాదు, గత 34 ఏళ్ల నుంచి అతడు ఆమె మాట వినకుండా తన లక్ పరీక్షించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు రూ.2.5 కోట్లతో భార్యకు ఊహించని షాకిచ్చాడు. 

ఇంతకీ అతడికి అంత డబ్బు ఎలా వచ్చిందనేగా మీ సందేహం? అదే లాటరీ మహిమ. అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అయితే, ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. లక్ లేకుండా లక్ష్మీదేవి వరించదు. అందుకే, పంజాబ్‌లోని బతిందాకు చెందిన రోషన్ సింగ్ తనవంతు ప్రయత్నంగా  గత 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు లక్ష్మీదేవి తన ఇంటి తలుపు తట్టదా అని ఎదురుచూసేవాడు. కానీ, ఒక్కసారి కూడా లాటరీ విన్ కాలేదు. దీంతో అతడి భార్య.. ‘‘డబ్బులు ఊరికే రావు, వాటిని సేవ్ చేయండి’’ అని చెప్పేది. కానీ, లాటరీ టికెట్లు కొనడాన్ని అలవాటుగా మార్చుకున్న రోషన్‌కు ఆమె మాటలు బుర్రకు ఎక్కేవి కావు. ఆమెకు తెలియకుండానే కొన్ని లాటరీ టికెట్లను కొనేవాడు. తాజాగా ఓ లాటరీ టికెట్ డీలర్ నుంచి రోషన్‌కు ఫోన్ వచ్చింది. ‘‘మీరు రూ.2.5 కోట్ల లాటరీని గెలుచుకున్నారు’’ అని అతడు చెప్పగానే రోషన్ ఆనందానికి అవధుల్లేవు. 

రోషన్ ‘బీబీసీ హిందీ’తో మాట్లాడుతూ.. ‘‘ఎక్కడా ఉద్యోగం లభించకపోవడంతో 1987లో బట్టల షాపులో పనిచేయడం ప్రారంభించాను. 18 ఏళ్ల తర్వాత సొంతంగా ఒక షాప్ ప్రారంభించాను. 1988 నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దాచుకొనేవాడిని. అప్పుడప్పుడు రూ.100 నుంచి రూ.200 వరకు లాటరీ డబ్బులను గెలుచుకొనేవాడిని. కానీ, పెద్ద మొత్తాన్ని గెలుచుకోలేకపోయేవాడిని. కానీ, పెట్టిన డబ్బు ఏదో ఒక ప్రైజ్ మనీ రూపంలో తిరిగి వచ్చేది. అందుకే, లాటరీ టికెట్లను కొనుగోలు చేయడం ఆపలేదు’’ అని తెలిపాడు. తన లక్ పరీక్షించుకోవడం కోసం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో అతడి భార్య చాలాసార్లు వారించింది. అతడు ఎలాగైనా కుంభస్థలాన్ని బద్దల కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడని తెలిసి, హెచ్చరించడం మానేసింది. 

Also Read: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక, ఈ రెండు నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు

లాటరీ టికెట్ ఏజెంట్ కాల్ చేయగానే.. తన స్నేహితులు తనను ఆటపట్టిస్తున్నారు కాబోలని రోషన్ భావించాడు. మరోసారి వివరాలు అడగ్గా.. తాము రామ్‌పురా పౌల్ లాటరీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, మీరు రూ.2.5 కోట్లు గెలుచుకున్నారని స్పష్టం చేశారు. ‘‘ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి కనీసం రూ.10 లక్షలైనా గెలుచుకోవాలనే లక్ష్యంతోనే లాటరీ టికెట్లు కొనేవాడిని. అంతకంటే ఎక్కువ ఆశించేవాడిని కాదు. కానీ, దేవుడు కరుణించి ఏకంగా ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకొనేలా చేశాడు’’ అని రోషన్ తెలిపాడు. పన్నులన్నీ చెల్లించిన తర్వాత చేతికి రూ.1.75 కోట్లు వస్తాయని, ఈ డబ్బును తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెడతానని అతను పేర్కొన్నాడు. కొంత మొత్తంతో కొత్త వ్యాపారం మొదలుపెడతానని తెలిపాడు. 

Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?

Published at : 24 Apr 2022 09:28 AM (IST) Tags: Punjab Lottery Punjab State Lottery Man Wins Lottery Punjab Man Wins Lottery

సంబంధిత కథనాలు

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!